చాతుర్మాస్య వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని చెబుతోంది స్మృతి కౌస్తుభం . ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతం మొదలుపెట్టక పోవటంతో, ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు(వాసుదేవుడు) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు.
వాసుదేవ అనే పేరు వెనుక
- వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ప్రత్యేకత ఉంది.
- వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది
- అన్నిటిలో వసించు వాడు కునుక వాసుదేవుడు అని అంటారు
- విష్ణు సహస్రనామంలో ‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’ అనేది దీనినే సూచిస్తోంది
- ఇక అన్ని ప్రాణుల్లో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు.
- ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది - ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే...
- ‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’ అంటే అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని విష్ణు సహస్ర నామంలో వివరించారు.
అర్జునుడు కృష్ణుణ్ని ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవా అనే
Also Read: శివుడు సృష్టించిన గణమే పోతురాజు, బోనాల్లో వీళ్లు ఎందుకంత ప్రత్యేకం అంటే!
ఇక ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానకి వస్తే శయనేకాదశి రోజు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశే పుణ్య తిథి, విష్ణువుకి ప్రీతికరమైనది, శయన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ. వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాల్లో ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం ఫాలో అవ్వాలి. వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్ర నామం పఠించటం, గోపద్మ వ్రత కథను చదవటం శ్రేయస్కరం.
Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!