Tuesday Tips: మంగళవారం అంటే హనుమంతుడికి ఇష్టమైన రోజు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి, వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆ వ్యక్తి విజయం సాధిస్తాడు. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి మంగళవారం నాడు ఆయనకు తమలపాకు నైవేద్యంగా పెట్టి పూజించాలి.
ఆంజనేయ స్వామికి తమలపాకు, మోతీచూర్ లడ్డు, ఎర్రటి పువ్వులు, మల్లె నూనె చాలా ఇష్టం. అందులో ముఖ్యమైనది తమలపాకు. మంగళవారం నాడు హనుమంతుడికి తాంబూలం అంటే తమలపాకులు ఎందుకు నైవేద్యంగా పెడతారు..? మరి దీని వల్ల ప్రయోజనం ఏంటో చూద్దాం.
1. హిందూ ధర్మంలో తమలపాకు
తమలపాకులను తరచుగా హిందూ సంప్రదాయంలో శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. పూజల్లో వీటిని తప్పనిసరిగా వినియోగిస్తారు. మంగళవారం తమలపాకులను నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. పూజించిన వ్యక్తి అన్ని కోరికలను త్వరలో నెరవేరుస్తాడు. మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకులు ఎలా నైవేద్యంగా సమర్పించాలి?
Also Read : ఈ ఆలయాల్లో హనుమంతుడి విగ్రహాలు నల్ల రంగులో ఉంటాయ్, ఎందుకో తెలుసా?
2. మంగళవారం తమలపాకుతో పరిహారాలు
- ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కోసం
మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి 5 తమలపాకులు, కుంకుమ బొట్టు పెట్టి మాల వేసి హనుమంతుని విగ్రహానికి వేయాలి. మీరు ఇలా చేస్తే, హనుమంతుడు త్వరగా సంతుష్టుడయి మీ పని, వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు.
- సమస్యల నుంచి ఉపశమనం కోసం
మంగళ, శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి హనుమంతుని పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం, శనివారం ఈ పని చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.
-ఆర్థిక సమస్యలకు పరిష్కారం
ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు రాకపోయినా, వచ్చిన నిలవక పోతుంటే, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మీరు పనిచేసే కార్యాలయం లేదా షాపునకు తూర్పు దిక్కున తమలపాకును కట్టాలి. ఈ తమలపాకును ఒక్కసారి కట్టి అలాగే వదిలేస్తే మీకు లాభం ఉండదు. మీరు గతంలో కట్టిన తమలపాకును తీసివేసి, ప్రతి శనివారం లేదా మంగళవారం నీటి ప్రవాహంలో వదలాలి. తర్వాత దాని స్థానంలో కొత్త తమలపాకును కట్టాలి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి.
- ప్రతికూలత నివారణ
మీ ఇంట్లో లేదా మీ పని ప్రదేశంలో లేదా మీ వ్యాపార స్థలంలో ఏదైనా సరే, మీరు వాస్తు దోషాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా ప్రతికూల శక్తులు మీ పురోగతిని అడ్డుకుంటున్నాయని మీరు భావిస్తే, మంగళవారం నాడు మీరు పసుపును నీటిలో కలిపి, ఆ నీటిని ఇల్లు, కార్యాలయం, షాపు ప్రతి భాగంలో తమలపాకు సహాయంతో చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతికూలత తొలగి సానుకూల శక్తులు పెరిగి మీరు ప్రయోజనం పొందుతారు.
Also Read : అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి
కేవలం మంగళవారమే మాత్రమే కాకుండా, పైన పేర్కొన్న నాలుగు పనుల్లో దేనినైనా మీరు శనివారం కూడా చేయవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.