Horoscope Today 2023 August 22nd


మేష రాశి 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరో ఒకరి కారణంగా టెన్షన్ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించండి. ఆహార నియమాలు పాటించండి.ఉద్యోగులు, వ్యాపారులు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు.


వృషభ రాశి 
ఈ రోజు ఈ రాశి వారికి మనస్సులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సహాయ, సహకారాలుంటాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ప్రత్యేకమైన పని కోసం కార్యాచరణ, ప్రణాళిక  రూపొందించవచ్చు.


మిథున రాశి
ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ తెలివితేటలతో సకాలంలో  పనులు పూర్తి చేస్తారు. మీరు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు.  ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ద తీసుకోవాలి. ఆహార, పానీయాల పట్ల నియంత్రణ అవసరం. లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు.


కర్కాటక రాశి 
ఈ రాశి స్త్రీ పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. కుటుంబ సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది, మీరు  కుటుంబం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి


సింహ రాశి 
ఈ రోజు మీకు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది.


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆనందం, వారికి ఆదాయం - ఆగష్టు 21 to 27 వారఫలాలు


కన్యా రాశి 
ఈ రోజు ఈ రాశి వారు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్థాయి. బహుమతులు పొందుతారు.  సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరనుకున్న పనిని పూర్తి చేసి ఆత్మవిశ్వాసాన్ని పెపొందించుకుంటారు. ఈ రోజు మీరు కుటుంబం కోసం మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
 
తులా రాశి 
ఈ రాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామి నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర హడావిడి ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు కుటుంబ సమస్యల వల్ల, ఆర్ధిక ఇబ్బందులవలన, ఆందోళన చెందుతారు. 


వృశ్చిక రాశి 
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ కారణంగా మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. ఇంటి పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీరు మీ సహోద్యోగులతో కలిసి కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు వేస్తారు. కార్యాలయపనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.


ధనుస్సు రాశి 
ఈ రోజు ఈ రాశి వారు  చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సృజనాత్మక రంగం లో ఉన్నవారు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల సహకారం పొందుతారు. ఈ రోజు మీరు కుటుంబానికి సంబందించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి.


మకర రాశి
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు అందుతాయి. కుటుంబ పెద్దల సహాయ, సహకారాలు లభిస్తాయి. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే, విజయం సాధిస్తారు. 


కుంభ రాశి 
ఈరోజు  ఈ రాశివారికి  ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.  మీరు అనుకున్న పనులన్నీ ఈ రోజు నెరవేరుస్తారు. కుటుంబం సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


Also Read: దైవారాధన నుంచి ఖగోళంలో జరిగే అద్భుతాల వరకూ అన్నిటికీ ఈ పురాణాలే ఆధారం!


మీన రాశి  
ఈ రోజు ఈ రాశి వారు సామాజిక రంగంలో గొప్ప స్థానాన్ని పొందుతారు. పిల్లల చదువుల విషయంలో ఆందోళన చెందుతారు. ఏదో ఒత్తిడి వెంటాడుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి శుభసమయం. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు శుభసమయం. ఉద్యోగులు, విద్యార్థులకు శుభఫలితాలున్నాయి. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.