Nirjala Ekadashi :  జ్యేష్ఠ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ నెనలలో జ్యేష్ఠపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు.  ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 06 శుక్రవారం వచ్చింది.  

నిర్జల ఏకాదశి మాత్రమే కాదు ఈ నెలలో వచ్చే పండుగలన్నీ నీటితో ముడిపడే ఉంటాయి. నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఈ రోజున ఆహారం  నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు .   ఏకాదశి  శ్రీ మహా విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ నిర్జల ఏకాదశి రోజు ప్రత్యేకంగా కొన్ని చెట్లకు నీరు సమర్పించాలి. ఇది అనుసరించకపోతే ఈ ఏకాదశి రోజు ఆచరించే ఉపవాస ఫలితం అసంపూర్ణం అంటారు పండితులు.  

నిర్జల ఏకాదశి రోజు ఏ చెట్లను పూజించాలి?

రావి చెట్టు

జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టును పూజించే ఆచారం ఉంది. ఈ చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ముగ్గురు దేవతలు,  పితృదేవతలు కూడా సంతోషిస్తారు.లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట.అందుకే ఈ ఏకాదశి రోజు రావిచెట్టుకి నీటిని సమర్పించడం, పూజించడం అత్యంత ప్రధానం అంటారు. రావి చెట్టుకు నీటిలో పాలు మరియు నల్ల నువ్వులు కలిపి సమర్పించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.

ఉసిరి చెట్టు

ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతంగా కొలువై ఉంచాడని చెబుతారు. అందుకే నిర్జల ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకి నీటిని సమర్పించడం అత్యంత శుభఫలితాలను ఇస్తుంది. ఈ చెట్టు మొదలు దగ్గర దీపం వెలిగించి, పచ్చి పాలు నివేదించి..భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని, బంధం బలపడుతుందని చెబుతారు. 

తులసి

నిర్జల ఏకాదశి రోజున తులసిని పూజించేటప్పుడు దీపం వెలిగించాలి. తులసి అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుందంటారు పండితులు. తులసి చుట్టూ ఈ రోజు 11 సార్లు ప్రదక్షిణ చేయండి.

శ్లోకంశాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

శ్రీమతే విష్ణుభక్తాయ శంఖచక్రాదిధారిణే |వారుణీ కీర్తి సహితాయానంతాయాస్తు మంగళమ్ ||

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునే ముందు  మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!