2025 జూన్ 6 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 6th 2025

మేష రాశి (Aries) జూన్ 6, 2025

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దినచర్యలో వ్యాయామానికి టైమ్ కేటాయిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ సౌకర్యాల కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఏదైనా లావాదేవీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి.  

వృషభ రాశి (Taurus) జూన్ 6, 2025

ఈ రోజు మీకు కొంత కష్టతరంగా ఉంటుంది. ప్రేమ జీవితం గడిపేవారు తమ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు.  తల్లిదండ్రుల పూర్తి మద్దతును పొందుతారు, కాని మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పేందుకు వెనుకాడవద్దు. మీరు ఏదైనా కొత్త పథకంలో డబ్బు పెట్టే ముందు మీ సోదరులతో మాట్లాడాలి.

మిథున రాశి (Gemini) జూన్ 6, 2025

ఈ రోజు మీరు ఏదో ఒక విషయం గురించి ఒత్తిడికి గురవుతారు. మీ స్వభావంలో కొంత చిరాకు కూడా కనిపిస్తుంది. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ప్రతికూల పరిస్థితులలో కూడా సహనం పాటించాలి. మీరు ఇంతకు ముందు కొంత డబ్బు అప్పుగా తీసుకుంటే దానిని తీర్చగలుగుతారు. వ్యాపారం చేసేవారికి ఈ రోజు కొంచెం బలహీనంగా ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer) జూన్ 6, 2025

ఈ రోజు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా ఆస్తి సంబంధిత వివాదంతో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చు.  ఒకేసారి చాలా పనులు చేయవలసి రావడంతో, మీరు మీ ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయాలి.  ఆహారంపై నియంత్రణ ఉంచుకోవాలి, లేకపోతే మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.  ఏదైనా ముఖ్యమైన పని కారణంగా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

సింహ రాశి (Leo) జూన్ 6, 2025

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు తీసుకున్న పాత నిర్ణయం గురించి మీరు చింతిస్తారు. పని రంగంలో ప్రతికూల పరిస్థితుల నుంచి  బయటపడగలుగుతారు.  మీ ప్రత్యర్థులు కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. వారి నుండి దూరంగా ఉండాలి. మీరు మీ స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలుసుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ఏదైనా బాధ్యత ఇస్తే, వారు దానిని నెరవేరుస్తారు.

కన్య రాశి (Virgo) జూన్ 6, 2025

ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి  ఈరోజు మంచిది. పని రంగంలో మీపై చాలా ఒత్తిడి ఉంటుంది. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.  బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు.  

తుల రాశి (Libra) జూన్ 6, 2025

ఈ రోజు మీకు అనవసర ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయవద్దు. పొదుపు చేసిన డబ్బును చాలావరకూ కోల్పోతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల పరుగులు తీయాల్సి వస్తుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 6, 2025

ఈ రోజు మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారంలో కోరుకున్న లాభాలు రాకపోవడంతో మీ మనస్సు కొంచెం కలత చెందుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే మంచి ఫలితాలు పొందుతారు. భూమికి సంబంధించిన ఏదైనా విషయం మీకు సమస్యగా మారవచ్చు. మీరు దానిని సకాలంలో పరిష్కరించాలి.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 6, 2025

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలను తీసుకురాకుండా ఉండాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు.   పరోపకార కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు తమ విద్యలో ఎదురవుతున్న సమస్యల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు.  వైవాహిక జీవితంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఎవరినీ గుడ్డిగా నమ్మేయవద్దు.

మకర రాశి (Capricorn) జూన్ 6, 2025

చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.  స్నేహితులతో కొంత సమయం సరదాగా గడుపుతారు. భాగస్వామ్యంలో ఏదైనా పని చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు తల్లిదండ్రులతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. కుటుంబంలో వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ప్రయాణం చేయాల్సి వస్తుంది. 

కుంభ రాశి (Aquarius) జూన్ 6, 2025

వ్యాపారం చేసేవారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.మీరున్న రంగంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది. ఎవరి మాటలు విన్నా అంతిమ నిర్ణయం మీదే అవ్వాలి. అప్పులు ఇవ్వాల్సి వస్తే కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లల కెరీర్ గురించి ఆందోళన ఉండే అది తీరిపోతుంది.  

మీన రాశి (Pisces) జూన్ 6, 2025

ఈ రాశి వ్యాపారులకు ఈ రోజు కొన్ని హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది.కుటుంబంలో వివాదాలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆరగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం బావుంటుంది.  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.