Moola Nakshatra Saraswati Puja and Sloakas: చ‌దువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం.దసరా వేడుకల్లో మూలా నక్షత్రం  రోజు భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా  త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలో నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే సరస్వతి అలంకారం ప్రత్యేకత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయినిగా విరాజిల్లుతోంది. 


సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి చేతిలో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ  ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు. 


భక్తి శ్రద్ధలతో సరస్వతిని ధ్యానిస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. 


సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం 
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా: 


ప్రణోదేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ ధీనా మవిత్రయవతు


Also Read: ఏడో రోజున దుర్గ అవతారం చదువుల తల్లి సరస్వతి - ఇలా పూజిస్తే అమ్మవారి కటాక్షం


సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష  జాడ్యాపహా


పోతన చెప్పిన శ్లోకం
తల్లీ  నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ 
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్ 
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్ 
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....


సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ 
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ  
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా 
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా 
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ 
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ 
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః 
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ 


Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!


సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
ఈ శ్లోకాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి నమస్కరించాలి. ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని చెబుతారు. 


యాకుందేందు తుషారాహా రదవలా యాశు బ్రవశ్రాన్వితా !!
యా వీణా వరదండ మండితాకార యా శ్వే త పద్మాసనా!! 
బ్రమ్మచ్యుత శంకర ప్రభుతివీర్ దైవస్సదా పూజిత
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా !!


ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్