ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలకు, భక్తులు చాలా మందికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాలతో ప్రజల్లో భక్తి భావం పెంపొందించే కృషి చేస్తున్నారు. ముచ్చింతల్‌లోని సమతా మూర్తి విగ్రహం దగ్గర నిత్యం జరిగే కైంకర్యాల గురించి తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) చేతుల మీదుగా ఆవిష్కరించారు.
మోడీని కలిసిన చిన్న జీయర్ స్వామిసమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్య దేశాలలో కొలువుదీరిన దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అను నిత్యం ఆ మూర్తులకు కైంకర్యాలు జరుగుతాయి. ఆ సమతా మూర్తి కేంద్ర ప్రారంభోత్సవానికి మోడీ వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆ కేంద్రానికి ఆయన వచ్చే అవకాశం ఉంది.
ముచ్చింతల్ ప్రాంతంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతోంది. మూడో వార్షికోత్సవ సందర్భంగా ఈ ఏడాది చివర్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఆ వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని ప్రధాన మంత్రిని ఆహ్వానించారు.
Also Read: ధర్మస్థల రహస్యాలు - మంజునాథ స్వామి ఆలయం వెనుక దాగిఉన్న అద్భుతాలు, దర్శన సమయాలు!
నరేంద్ర మోదీని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డా. జూపల్లి రామేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు కూడా కలిశారు. వారి ఆహ్వానానికి ప్రధాన మంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద - హోమియో కళాశాల పురోగతి గురించి వివరించగా... ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రామేశ్వర రావు, రాము రావును ప్రధాని అభినందించినట్టు తెలిసింది.
Also Read: భార్య, డబ్బు, కెరీర్ అన్నింటినీ దూరం చేసే 4 అలవాట్లు ఇవే!