Naga Panchami 2023: ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకొంటారు. ఈ రోజు నాగదేవతను పూజిస్తారు. కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు. మరికొన్ని చోట్ల సమీపంలోని నాగ సన్నిధానాన్ని సందర్శించి అక్కడి నాగులను పూజిస్తారు. ఈ రోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని ఒక నమ్మకం. ఈ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన నాగ పంచమి జరుపుకొంటారు. నాగ పంచమిని చాలా చోట్ల బొమ్మల పండుగ అని కూడా అంటారు. నాగ పంచమి శుభ ముహూర్తం...? పూజ విధానం, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
2023 నాగర పంచమి ఎప్పుడు..?: సోమవారం 21 ఆగస్టు 2023
నాగర పంచమి 2023 తిథి ప్రారంభం: 20 ఆగస్టు 2023 ఆదివారం మధ్యాహ్నం 12:21 నుంచి
నాగర పంచమి 2023 తిథి ముగింపు: 21 ఆగస్టు 2023 సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల వరకు
,
నాగ పంచమి ప్రాముఖ్యత
నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగదేవత ఇంటిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు నాగదేవతను పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు. అదే సమయంలో, నియమాలు పాటిస్తూ, ఆచార వ్యవహారాలతో పూజా కైంకర్యాలు చేయడం ద్వారా, పరమేశ్వరుడు సంతోషిస్తాడు, వారి ప్రతి కోరికను నెరవేరుస్తాడు. అంతే కాకుండా నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల జాతకంలో కాల సర్పదోష ప్రభావం తగ్గుతుంది.
నాగ పంచమి పూజా విధానం
నాగ పంచమి రోజు గోడకు కుంకుమ పూసి పూజా స్థలాన్ని సిద్ధం చేయండి. ఇది కాకుండా, మీ ఇంటి తలుపు వద్ద నాగదేవత చిత్రాన్ని ఉంచండి. నాగదేవత చిత్రాన్ని సువాసనగల పువ్వులు, పసుపు, చందనంతో పూజించాలి. ఈ రోజున ఇంట్లో పాయసం చేసి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి వారికి ఇవ్వాలి. బ్రాహ్మణులకు తినిపించే ముందు నాగదేవత ప్రతిమకు పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ వ్రతం చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవాలి.
Also Read : పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడమే కాకుండా నాగశిల్పం లేదా పాములను పూజించడమే కాకుండా ఇంటిలోని దేవుని గదిలో పేడతో 8 పాము ఆకారాలు చేసి పూజించాలి. జలాభిషేకం తర్వాత దానికి పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు, నెయ్యి సమర్పించండి. ఈ రోజున ఆదిశేష, అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, అశ్వథర, తక్షక, దృతరాష్ట్ర, శంఖపాల, కులీర, కర్కోటక, కళింగ, పింగళ అనే నాగులను పూజించే ఆచారం ఉంది. ఈ పాములను పూజించడం వల్ల రాహు-కేతువుల ప్రభావంతో తలెత్తే అశుభాలు తొలగిపోతాయి.
నాగ పంచమి సంక్షిప్త పూజా విధానం
ఉదయాన్నే లేచి స్నానం తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి.
పూజా స్థలంలో చెక్క పీఠాన్ని ఉంచి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరవాలి.
అప్పుడు ఈ పీఠంపై మట్టితో చేసిన సర్పం విగ్రహం, ఫోటో లేదా సర్పం చిత్రాన్ని గీయండి.
తర్వాత దానిపై గంగాజలం చల్లి, అభిషేకం చేసి నాగదేవతలను పూజకు ఆహ్వానించాలి.
తర్వాత నాగదేవతకు పసుపు, కుంకుమ, అక్షత, పుష్పాలు సమర్పించి పంచోపచార పూజ ద్వారా పూజించాలి.
పచ్చి పాలు, నెయ్యి, పంచదార కలిపి నాగమూర్తికి సమర్పించండి.
Also Read : స్కాంద పురాణంలోని ఈ సూచనలు పాటిస్తే సంతోషకరమైన జీవితం సాధ్యం
పూజానంతరం చివర హారతి ఇవ్వండి. ఈ రోజు పంచమి కథ వినడం శుభప్రదం.
అదేవిధంగా, సాయంత్రం కూడా హారతి ఇవ్వండి.
ఈ రోజు మీరు వీలైనంత వరకు దానధర్మాలు చేయాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.