Skanda Purana: స్కాంద‌ పురాణం హిందూ ధ‌ర్మంలోని 18 పురాణాలలో 13వ పురాణం. దీనిని మహాపురాణంగా కూడా పరిగణిస్తారు. శివుని కుమారుడైన కార్తికేయుని అనేక పేర్లలో స్కందుడు ఒకటి. ఈ పురాణానికి ఆయ‌న‌ పేరు పెట్టారు. దాదాపు 81 వేల శ్లోకాలతో కూడిన ఈ పురాణంలో కాశీఖండం, మహేశ్వర ఖండం, రేవఖండం, అవంతిక ఖండం, ప్రభాస ఖండం, బ్రహ్మ ఖండం, వైష్ణవ ఖండం అనే మొత్తం ఏడు విభాగాలున్నాయి. కొందరు పండితులు ఆరు విభాగాలు చెప్పారు. ఇది 51 శక్తి పీఠాలు, 27 నక్షత్రాలు, 18 నదులు, 12 జ్యోతిర్లింగాలు, మన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉండే మతపరమైన జ్ఞానం, నైతికతకు సంబంధించిన అనేక ఇతర అంశాలతో సహా భారతదేశంలోని పర్వత శ్రేణులను కూడా ప్రస్తావిస్తుంది.


ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం
స్కాంద పురాణాన్ని పఠిస్తే శంకర భగవానుడు ప్రసన్నుడవుతాడు. దీని వివరణ స్కాంద పురాణంలోని మహాకాల కథలో కనిపిస్తుంది. ఇది 12 జ్యోతిర్లింగాల మూలాన్ని వివరిస్తుంది. శివపూజలో మీకు వీలైతే స్కాంద పురాణాన్ని పఠించవచ్చు.


ప్రదోష వ్రత ప్రాముఖ్యం
స్కాంద పురాణంలో ప్రదోష వ్రత మహిమ వర్ణన ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇందులో బ్రాహ్మణుడు - శాండిల్య మహర్షి కథ ద్వారా ఈ వ్రత మహిమను చూడవచ్చు.


గృహ జీవితం
స్కాంద పురాణంలో గృహ జీవితం గురించి చెప్పారు
జీవితం చ ధనం పుత్రః క్షేత్ర గృహాణి చ|
యతి ఏషాం ధర్మకృతే తా భువి మానవః|| స్కాందపురాణః


భావము: ధనం, భార్య, కొడుకు, గృహ-మతపరమైన పనులు, వ్యవసాయం ఈ 5 విషయాలను జీవితంలో కలిగి ఉన్న వ్యక్తి ఈ భూమిపై విజయవంతమైన జీవితం అనుభ‌విస్తాడ‌ని స్కాంద పురాణం చెబుతోంది.


శ్రద్ధ, మేధ‌ ప్రాముఖ్యం
సంక్షిప్త స్కాందపురాణంలోని వైష్ణవ ఖండ-కార్తీకమాస-మహాత్మ్యం ప్రకారం, ఈ భూమిపై కామము, క్రోధము మొదలైనవాటిని నశింపజేసే రెండు విషయాలు శ్రద్ధ, మేధ‌ అని బ్రహ్మ దేవుడు చెప్పాడు.


ప్రాచీన పురాణాల పరిజ్ఞానం


చంద్ర కథ
ఇది సోమదేవుడు, తారా దేవి కుమారుడైన బుద్ధుని మూల కథ. ఈ పురాణంలో 27 రాశుల వివరణ కూడా ఉంది. ఈ కథను వింటే పాపాలు, రోగాలు నశిస్తాయి అని స్కాంద పురాణంలో పేర్కొన్నారు.


తారకాసుర వధ కథ
ఇది శైవ శాఖకు చెందిన పురాణం, ఇందులో శివుని కుమారుడు స్కందుడు తారకాసురుని వధించిన వృత్తాంతాన్ని వివ‌రించారు. ఈ కథను విని కార్తికేయుడిని పూజించడం ద్వారా, మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.


సముద్ర మ‌థ‌నం కథ
స్కాంద పురాణంలో సముద్ర మథ‌నం కథ కూడా ఉంది. ఈ కథను వింటే సమాజంలో యోగ్యమైన వ్యక్తిగా మారి లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారని చెబుతారు.


గంగానది మూలం కథ
ఈ పురాణం కూడా 18 నదులతో గంగానది ఆవిర్భావ కథను వివరిస్తుంది. గంగావ‌త‌ర‌ణ‌ కథను వినడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి అని ఇందులోని సూచన.


సతీదేవి కథ
ఈ స్కాంద పురాణంలో సతీ దహన కథ, శక్తిపీఠాల వివరణను మనం చూడవచ్చు. సతీ దహన కథ వినడం వల్ల పుణ్యం వస్తుంది. ఇది కాకుండా, స్కాంద పురాణంలో మతపరమైన విజ్ఞానం మరియు నైతికతకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించారు. దీని వ‌ల్ల వ్యక్తి మ‌నస్సు స్వచ్ఛంగా మారుతుంది. మంచి పనులలో నిమగ్నమై జీవితం విజయవంతమవుతుంది.


Also Read : నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి


వైశాఖ మాసం కథ
స్కాంద పురాణంలోని వైష్ణవ భాగంలోని 4వ అధ్యాయంలో, వైశాఖ మాసం ప్రాముఖ్యం గురించి వివరంగా తెలిపారు. దాని 34వ శ్లోకం ప్రకారం ఈ మాసంలో నూనె రాసుకోవడం, పగలు నిద్రపోవడం, కంచు పాత్రల్లో భోజనం చేయడం, రెండు పూటలా భోజనం చేయడం, రాత్రిపూట భోజనం చేయడం మొదలైనవి నిషిద్ధం. వైశాఖ మాసంలో పుణ్య నదులలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది. మహిరథుడు అనే రాజు వైశాఖ స్నానం వల్ల వైకుంఠధామాన్ని పొందాడని స్కాందపురాణంలో పేర్కొన్నారు.


Also Read : 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.