Stock Market Today, 10 July 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.20 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 31 పాయింట్లు లేదా 0.16 శాతం రెడ్‌ కలర్‌లో 19,427 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌/ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


సైయెంట్ DLM: Cyient DLM షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అుతాయి. ఈ స్టాక్ 50% పైగా ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందని చేయబడుతుందని భావిస్తున్నారు.


HDFC బ్యాంక్: విలీనం నేపథ్యంలో, అన్ని MSCI ఇండెక్స్‌ల్లో HDFCకి బదులు HDFC బ్యాంక్‌ పేరు చేరింది.


సుజ్లాన్ ఎనర్జీ: రూ. 2,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని సేకరించేందుకు కంపెనీ వివిధ ఫైనాన్షియల్‌ రూట్స్‌లో ప్రయత్నిస్తుంది.


RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్, తన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ డీమెర్జర్‌కు రికార్డ్‌ తేదీని జులై 20గా నిర్ణయించింది.


హిందుస్థాన్ జింక్: హిందుస్థాన్ జింక్ బోర్డ్‌, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేర్‌కు రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్‌కు ఓకే చెప్పింది. ఇందుకోసం రూ. 2957 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ కంపెనీ, వేదాంత అనుబంధ సంస్థ.


బజాజ్ ఆటో: కొత్తగా లాంచ్‌ చేసిన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400x బుకింగ్స్‌ 10,000 దాటాయని బజాజ్ ఆటో తెలిపింది. స్పందన భారీగా ఉండడం వల్ల ఉత్పత్తి పెంచాలని ఈ కంపెనీ యోచిస్తోంది.


IOC: రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 22,000 కోట్ల వరకు క్యాపిటల్ సమీకరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.
టాటా కమ్యూనికేషన్: ఏస్ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝున్‌వాలా, జూన్ త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్‌లో మరిన్ని షేర్లు కొని, వాటా పెంచుకున్నారు.


వేదాంత: సెమీకండక్టర్లను తయారు చేసేందుకు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ యాజమాన్యాన్ని తమ హోల్డింగ్ కంపెనీ నుంచి టేకోవర్‌ చేస్తామని వేదాంత తెలిపింది.


RVNL: రూ. 808 కోట్ల విలువైన NHAI ప్రాజెక్ట్ బిడ్స్‌లో RVNL అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


HAL: ఇండియన్ కోస్ట్ గార్డ్‌ కోసం రెండు అప్‌గ్రేడెడ్‌ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సప్లై చేయడానికి భారత ప్రభుత్వం-హెచ్‌ఏఎల్ మధ్య రూ.458 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది.


మరో ఆసక్తికర కథనం: TDS కట్‌ కాని పోస్టాఫీస్‌ స్కీమ్స్‌ కొన్ని ఉన్నాయి, ఫుల్‌ అమౌంట్‌ మీ చేతికొస్తుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial