Mahabharat: మనందరికీ తెలిసినట్లుగా, మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథం. ఈ గ్రంథంలో మహాభారతానికి సంబంధించిన అనేక నగరాలు, ప్రదేశాల వివరణను మనం చూడవచ్చు. మహాభారతంలో పేర్కొన్న అనేక ప్రసిద్ధ ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు. కానీ, మహాభారతం కాలంతో పోలిస్తే, ప్రస్తుతం ఆయా ప్రాంతాల రూపాల్లో, పేర్లలో కొన్ని మార్పులు వచ్చాయి. మహాభారత కాలం నాటి ముఖ్యమైన ప్రదేశాలు.. వాటి ఇటీవలి పేర్ల గురించి తెలుసుకుందాం.
ఇంద్రప్రస్థ
ఇంద్రప్రస్థ మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా పేరొందింది. హస్తినాపురం నుంచి బహిష్కరించిన తరువాత, పాండవులు ఇంద్రప్రస్థాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. మహాభారతంలోని ఇంద్రప్రస్థ ప్రస్తుత భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం.
హస్తినాపురం
ఇంద్రప్రస్థ లాగానే హస్తినాపురం కూడా మహాభారతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఎందుకంటే హస్తినాపురం కౌరవుల రాజ్యం. మహాభారతం మొత్తం కథ హస్తినాపురం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రదేశం ప్రస్తుత మీరట్ నగరానికి సమీపంలో ఉంది. మహాభారత యుద్ధం కారణంగానే నేటికీ ఇక్కడి నేల ఎర్రగా ఉందని భావిస్తారు.
తక్షిలా
మహాభారత కాలంలో గాంధార ప్రాంత రాజధాని అయిన తక్షిలాను కాందహార్ అని పిలుస్తారు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. కౌరవుల తల్లి గాంధారి, గాంధార రాజు సుబల కుమార్తె. గాంధారి కారణంగా ఈ ప్రాంతానికి గాంధార అని పేరు వచ్చింది.
ఉజ్జనిక
మహాభారతంలో ప్రస్తావించిన ఉజ్జనిక అనే ప్రదేశం ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్. ద్రోణాచార్యుడు ఇక్కడే కౌరవులకు, పాండవులకు విద్య నేర్పాడని చెబుతారు. ఇక్కడ ద్రోణ సాగర సరస్సును పాండవులు నిర్మించారని భావిస్తారు.
వారణావతం
మహాభారత కాలంలో ప్రస్తావించిన ప్రదేశాల్లో వారణావతం ఒకటి. కౌరవులు పాండవులను లక్షగృహంలో కాల్చి చంపడానికి ప్రయత్నించిన ప్రదేశం ఇదే. ఈ లక్షగృహం నేడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉంది.
పాంచాల
పాంచాల రాజ్యం ద్రౌపది తండ్రి ద్రుపద రాజుకు చెందినది. ప్రస్తుతం ఈ ప్రదేశం హిమాలయాలు, చంబా నది మధ్య ప్రాంతాల్లో ఉంది. ద్రౌపదికి పాండవులతో ఈ ప్రదేశంలో వివాహం జరిగిందని చెబుతారు.
బృందావనం
మహాభారత కాలం నాటి బృందావనం ఇప్పటికీ ఈ పేరుతోనే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఈ ప్రదేశానికి శ్రీకృష్ణుడితో ప్రత్యేక సంబంధముందని భావిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో గడిపేవాడు.
అంగ రాజ్యం
కర్ణుడి రాజ్యమైన అంగ రాజ్యం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం, బీహార్‌లోని భాగల్‌పూర్ మహాభారత కాలం నాటి అంగదేశంగా ఉంది. మరికొందరు, ఉత్తర ప్రదేశ్‌లోని గోండును కర్ణుని రాజ్యంగా పరిగణిస్తారు. దీని కారణంగా అంగ దేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మథుర
మథుర నగరం వర్ణన మహాభారతంలో కూడా కనిపిస్తుంది. నేటికీ ఈ ప్రాంతాన్ని మథుర అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు జన్మించాడని మహాభారతంలో కథనం ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావించి భక్తులు భారీగా తరలివస్తారు.
Also Read: మహాభారతం నేర్పే ఐదు జీవిత పాఠాలు