Delhi School Bomb Threat: 


ఢిల్లీలోని స్కూల్‌లో ఘటన..


ఢిల్లీలోని ఓ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. స్కూల్‌కి నేరుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. బాంబు పెట్టామంటూ బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా స్కూల్ యాజమాన్యం టెన్షన్ పడిపోయింది. వెంటనే విద్యార్థులందరినీ బయటకు పంపేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిందీ ఘటన. వెంటనే పోలీసులు స్కూల్‌కి వచ్చి చాలా సేపు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులేమీ దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, ఆంబులెన్స్‌లు వచ్చాయి. చాలా సేపటి వరకు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పాక కాస్త రిలాక్స్ అయ్యారు. ఉదయం స్కూల్‌ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే స్కూల్‌కి వచ్చి తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. 


"స్కూల్‌ ప్రాంగణంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్వాట్ టీమ్‌లు కూడా ఇక్కడికి వచ్చాయి. స్కూల్ అంతా శానిటైజ్ చేస్తున్నారు"


- పోలీసులు 


ఢిల్లీలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఆకతాయిలు కావాలనే స్కూల్స్‌కి బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారు.