జులై నెల రాశిఫలాలు (Monthly Horoscope July 2022)
మేషం
ఈ నెలలో జన్మంలో కుజుడు, రాహువు ప్రభావం వల్ల అందరితోనూ విరోధాలుంటాయి. మంచికి వెళితే చెడు ఎదురవుతుంది. వాహన ప్రమాదం ఉంటుంది జాగ్రత్తపడండి. సోదరులతో గొడవలు జరుగుతాయి. ఏ పని చేపట్టినా పూర్తిచేయలేరు. భూ సంబంధ వ్యవహారాల్లో నష్టాలుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగేయకుంటే ఇబ్బందులు తప్పవు. వేరేవారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు.
వృషభం
వృషభ రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం అన్నివిధాలుగా బావుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పన్నెండో స్థానంలో ఉన్న రాహువు, కుజుడు వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత ఆందోళన ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
మిథునం
మిథున రాశివారికి ఈనెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. జన్మంలో 12 వ ఇంట గ్రహసంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. చేపట్టిన కొన్ని పనుల్లో సక్సెస్ అయితే మరికొన్ని పనుల్లో అపజయం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్ప మరే ఇతర ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొన్ని సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి
కర్కాటకం
కర్కాటక రాశివారికి కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగాలు, వ్యాపారులు, మీ వృత్తుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు మనశ్శాంతి ఉండదు. అనారోగ్య సమస్యలుంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి.మనసులో ఏదో అనుమానం వెంటాడుతుంది. అశాంతిగా ఉంటారు, గొడవలు పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిందే. కుటుంబంలోనూ పెద్దగా సంతోషం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచనలున్నాయి.
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
సింహం
సింహరాశివారికి ఈ నెలలో మొదటి పదిహేను రోజులు అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు, పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు, విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు, వ్యాపారులకు లాభాలొస్తాయి. నెలలో ద్వితీయార్థం మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. విపరీతంగా డబ్బు ఖర్చవుతుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రతివిషయంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.
కన్య
ఈ నెలలో అష్టమ కుజుడు ప్రభావం మీపై చాలా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త పడండి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉండొచ్చు. ఇల్లు మారే అవకాశాలున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో నష్టపోతారు. తోడబుట్టిన వారికారణంగా కొన్ని ఇబ్బందులుంటాయి. నమ్మినవారే మోసం చేస్తారు. చేసే వృత్తి వ్యాపారాలు మాత్రం బాగానే సాగుతాయి.
Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు