ఆగస్టు నెల రాశిఫలాలు ( Monthly Horoscope ) 


మేషం
ఈ నెలలో గ్రహసంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ నెలలో ఆ కోరిక నెరవేరుతుంది. బంధువులను కలుస్తారు.


వృషభం
వృషభ రాశివారికి ఆగస్టు నెలలో బాగా కలిసొస్తుంది. అన్ని రంగాల్లో ఉండేవారికి ఈ నెల అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. ప్రతివిషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. భూసంబంధిత వ్యవహారాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు.


కర్కాటకం
ఈ నెలలో ఈ రాశివారికి అంతా అనుకూల సమయమే. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ఆరోగ్యం బావుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు.  దైవ సంబంధిత కార్యక్రమాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారు.


Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1


సింహం 
ఆగస్టు నెలలో సింహరాశివారికి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం ఇది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆదాయానికి లోటుండదు. భార్య భర్త మధ్య సరైన అవగాహన ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. జన్మంలో రవి సంచారం వల్ల శారీరక శ్రమ ఉంటుంది.


కన్య
ఆగస్టు నెలలో కన్యారాశివారికి బాగానే ఉంది. ఏ పనితలపెట్టినా పూర్తిచేస్తారు. ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే సాగుతాయి. ప్రతివిషయంలో ధైర్యంగా ముందుకుసాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. 


వృశ్చికం
ఈ రాశివారికి ఈ నెలలో అంతా శుభసమయమే. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన మొత్తం చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సుఖంగా, సంతోషంగా ఉంటారు. 8 వ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి వల్ల భార్యకు ఆరోగ్య భంగం ఉంటుంది. స్త్రీ విరోధం తప్పదు. మాటతూలకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి


Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2


నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు


Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ