ఏటా డిసెంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే ఈ పర్వదినం వేల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. సుమారు 2 వేల సంవత్సరాల క్రితం రోమ్ కింగ్ డమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలున్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలంతా ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు. అదే సమయంలో రోమన్ రాజ్యంలో నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావని చెప్పాడు. పుట్టే బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని చెప్పింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పిన విధంగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి జోసెఫ్ కలలో కనిపించిన దైవదూత ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో గర్భం దాల్చిందని..ఆమెకు పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ..నమ్మిన ప్రజలకు పాపాల నుంచి విముక్తి కల్పిస్తాడని చెప్పాడు. దైవదూత మాటమేరకు జోసెఫ్..మేరీని ప్రేమతో ఆదరించాడు.
Also Read: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
రాజు ఆదేశాల మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు వెళ్లినప్పటికీ అక్కడ వారికి ఉండేందుకు అయితే వారు అక్కడికి వెళ్లేసరికి వారికి ఉండటానికి చోటు దక్కదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఓ వెలుగు రావడంతో గొర్రెల కాపరులంతా భయపడ్డారు. అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని అన్ని ఆనవాళ్లు చెబుతాడు. పశువుల పాకలో పుట్టిన బిడ్డని చూసి దేవదూత చెప్పిన విషయాన్ని ఆ గొర్రెల కాపరులు అందరికీ చెబుతారు. అప్పుడు సమయం డిసెంబరు 24 అర్థరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీన ఏటా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు.
Also Read: శాంటా ఇచ్చే బహుమతులు సరదాకి కాదు..సాయానికి...
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి