Rajasthan Mehandipur Balaji Temple: ఆత్మలు, దయ్యాలు, భూతాలు, గాలి సోకడం, దిష్టి...ఈ విషయాల్లో ఎవరి నమ్మకాలు వారివే. దయ్యాలు నిజంగా ఉన్నాయో లేదా అన్నది మిస్టరీనే అయినప్పటికీ...దయ్యాలు ఉన్నాయని నమ్మేవారు వాటినుంచి ఆ దేవుడు రక్షిస్తాడని కూడా విశ్వసిస్తారు. అలాంటి ఆలయంమే రాజస్థాన్ లో ఉన్న మెహందీపూర్ బాలాజీ. ఈ ఆలయంలో అడుగుపెడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పారిపోతుందని భక్తుల నమ్మకం..


Also Read: అన్నవరం ఆలయం కింద అంతస్తులో ఏముంది - ఈ క్షేత్రం గురించి మీకు తెలియని విషయాలివే!


రాజస్థాన్ ఆరావళి పర్వతాల సమీపం నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఇది చిన్న ఆలయమే కానీ నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అడుగుపెట్టాలంటనే భయపడిపోతుంటారంతా..ఎందుకంటే దుష్టశక్తులతో బాధపడేవారంతా ఆలయం పరిసరాల్లో కనిపిస్తారు. వైద్యులకు అందని చాలా అనారోగ్య సమస్యలు ఇక్కడకు వస్తే పరిష్కారం అవుతాయంటారు. అందుకే కేవలం రాజస్థాన్ నుంచి మాత్రమే కాదు..ఆ చుట్టుపక్క రాష్ట్రాల నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనానికి వస్తుంటారు.  వేల సంవత్సరాలకు ముందు ఓ భక్తుడికి ఆంజనేయుడు బాలుడి రూపంలో కనిపించి తన జాడ చెప్పాడట.ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమంతుడు కనిపించకపోవడంతో మళ్లీ కఠినమైన సాధన చేశాడట..అప్పుడు మరోసారి కలలో కనిపించి తాను వెలసిన ప్రదేశం గురించి స్పష్టత నిచ్చాడట.అప్పుడు ప్రతిష్టితమైన వాయుపుత్రుడు నిత్యం పూజలందుకుంటున్నాడు.  


Also Read:  అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!
 
స్వామి బాలహనుమంతుడిగా వెలిసిన ఈ ప్రదేశంలోనే మరో రెండు విగ్రహాలు దర్శించుకోవచ్చు. శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహం ఒకటి...దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం మరొకటి. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పూజలు మొదలైనాకానీ...ఆంజనేయుడి అసాధారణ  మహిమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దుష్టశక్తులతో బాధలు పడేవారు, మానసికరోగులు, మూర్ఛరోగులు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు మెహందీపూర్ బాలాజీ ఆశీశ్సులు పొందితే పరిష్కార మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కొలువైన బాలహనుమంతుడి విగ్రహాన్ని పెకిలించేందుకు అప్పట్లో కొందరు ప్రయత్నించారట..కానీ వాళ్లు ఎంత తవ్వినా విగ్రహానికి మూలం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారట. ఉగ్రుడైన స్వామి వారి పాదాలదగ్గర నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. ఆ  నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. మానసిక రోగులు ఈ తీర్థం తాగితే మార్పు మొదలవుతుందంటారు.  


Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయం..హనుమాన్ కి అత్యంత ప్రీతికరమైన మంగళవారం, శనివారాల్లో మరింత రద్దీ ఉంటుంది. అయితే సమస్యల్లో ఉన్నవారు మాత్రమే ఈ ఆలయానికి వెళతారు...ఏదో చూసొద్దాం అని వెళ్లినవారు మాత్రం అక్కడకు వచ్చిన వారిని భయపడతారు. ఎందుకంటే గాలి సోకిందని, దయ్యం పట్టిందని భావించేవారిని అక్కడకు తీసుకొస్తుంటారు..వాళ్లంతా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు , అరుస్తుంటారు. కొందరినైతే గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినవారైనా స్వామివారిని దర్శించుకున్న కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి వచ్చేస్తారట..అందుకే  మెహందీపూర్ బాలాజీ అంటే అంత విశ్వాసం...