Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి రేవతిని రెడీ చేస్తుంది. సీత వచ్చి మన ప్లాన్‌కి సిద్ధమా పిన్ని అని రేవతిని అడుగుతుంది. ఇక మహాలక్ష్మి పెళ్లి వాళ్ల ముందు రేవతిని తెగ పొడుగుతుంది. దానికి చలపతి రామ్‌తో ఏంటి రామ్ మీ పిన్ని బూతులు మాట్లాడుతుందని సెటైర్లు వేస్తాడు. సీత, విద్యాదేవిలు రేవతిని తీసుకొని వస్తారు. 


మహాలక్ష్మి: పేరుకే మా ఆడపడుచు కానీ మా కూతురితో సమానం. 
అర్చన: మా పిల్లలు ప్రీతి, ఉషలతో పాటు పెరిగింది. 
చలపతి: మా చెల్లెలు మహాలక్ష్మి అంటే ఇంట్లో అందరికి భయం హడల్ అన్నమాట.
పెళ్లివాళ్లు: హడల్ అంటే.
జనార్థన్: అంటే గౌరవం అన్నమాట. తన మాట అంటే అందరికి అంత ఇష్టం.
విద్యాదేవి: సీత, రేవతి ఏం చేయబోతున్నారు.
చలపతి: సీత ఏదో ప్లాన్ వేసినట్లు ఉంది. 
జనార్థన్: అయితే మా చెల్లి మీకు ఓకే కదా. పెళ్లి ముహూర్తం పెట్టుకుందామా.
సీత: ఆగండి మామయ్య పిన్నిని కూడా అడగాలి కదా.
అర్చన: సీత ఏదో ప్లాన్ చేసినట్లు ఉంది మహా.
మహాలక్ష్మి: అది ఏం చేసినా నేను తిప్పి కొడతాను. నువ్వు టెన్షన్ పడకు. 
సీత: పెళ్లి కొడుకు నచ్చాడా. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా ఏ విషయం ధైర్యంగా చెప్పు పిన్ని. 
రేవతి: ఈ పెళ్లి నాకు ఇష్టమే. కానీ నేను ఇది వరకే ఓ అబ్బాయిని ప్రేమించాను. 
సీత: ఏంటి పిన్ని నువ్వు లవ్‌లో ఉన్నావా.
రేవతి: అతన్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.
మహాలక్ష్మి: రేవతి ఏం మాట్లాడుతున్నావ్.
అర్చన: సీత అన్నంత పని చేసింది మహా ఏదో ఒకటి చేయ్.
మహాలక్ష్మి: మా ఆడ పడుచు జోక్ చేస్తుంది. 
రేవతి: నేను జోక్ చేయలేదు. సీరియస్. 
సీత: రేపు ప్రేమించిన వాడు వచ్చి మనం ప్రేమించుకున్నాం. కలిసుందాంరా అంటే రేవతి పిన్ని వెళ్లిపోతుందేమో.
రేవతి: కచ్చితంగా వెళ్లిపోతా. పెళ్లి అయినా సరే వెళ్లిపోతా. 
సీత: అంటే పెళ్లి ఇతనితో అయినా కాపురం ఆయనతో అంటావ్ అంతేనా.. 
రేవతి: అంతే..
సీత: ఇదండీ విషయం. 


పెళ్లి వాళ్లు ఈ సంబంధం మాకు వద్దు అని వెళ్లిపోతారు. మహాలక్ష్మి ఎంత చెప్పినా వాళ్లు వినరు. పెళ్లి చూపులకు ముందు విషయం చెప్పుంటే ఇంత వరకు రాదు కదా అని మహాలక్ష్మి, అర్చనలు కోప్పడతారు. నిన్న చెప్పకుండా ఈరోజు చెప్పడం ఏంటని తిడతారు. విద్యాదేవి మాట్లాడితే మహాలక్ష్మి మధ్యలో రావొద్దని చెప్తుంది. ఇక రేవతి తన ప్రేమని తనకు దూరం చేశారని ఎమోషనల్ అవుతుంది. ఇంకోసారి తన జోలికి రావొద్దని రెండు చేతులు జోడించి దండం పెట్టి వెళ్లిపోతుంది. తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. సీత, విద్యాదేవి, చలపతి అక్కడికి వెళ్లి ఓదార్చుతారు. 


రేవతి: నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను ఎందుకు బతుకుతున్నానో ఎందుకు బతకాలో అర్థం కావడం లేదు.
సీత: అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావ్. మేమంతా లేమా. 
విద్యాదేవి: చుట్టూ ఎంత మంది ఉన్నా ప్రేమించిన తోడు లేకపోతే ఆ మనిషి పరిస్థితి నరకంలో ఉన్నట్లే ఉంటుంది. 
రేవతి: నా పరిస్థితి కరెక్ట్‌గా చెప్పారు. నా ప్రేమను దూరం చేసుకొని ఇలా ఎన్ని రోజులు ఉండాలో తెలీడం లేదు. అన్నయ్యల్ని ఎదురిస్తూ లోలోపల కుమిలిపోతున్నాను.
సీత: నువ్వు ఎవర్ని ప్రేమించావో చెప్పు పిన్ని.
విద్యాదేవి: నీకు అభ్యంతరం లేకపోతే  చెప్పు రేవతి. మాకు చేతనైన సాయం చేస్తాం. 
చలపతి: మహాలక్ష్మి నీ ప్రేమను దూరం చేసిందని తెలుసుకానీ ఏం జరిగిందో తెలీదు. 
రేవతి: కిరణ్ మన ఆఫీస్‌ మ్యానేజర్‌గా పనిచేసేవాడు. ఆఫీస్‌ పనుల్లో భాగంగా ఇంటికి వస్తూ వెళ్తుంటాడు. అలా మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఒక రోజు కిరణ్ ఇంటికి వచ్చాడు. 
మహాలక్ష్మి: ఏంటిది కిరణ్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి. కంపెనీ మొత్తం నా పేరు మీద ఉండాలి అని చెప్పాను కదా.
కిరణ్: సారీ మేడం కంపెనీ సుమతి మేడంది కాదా అందుకే ఆస్తి మొత్తం ఆమె పిల్లలు అయిన రామ్, ప్రీతిల పేర్ల మీద ఉండాలి అని ఇలా చేశాను. జనార్థన్ సార్‌కి చెప్పాను. సార్ ఓకే అన్నాకే మేటర్ రాయించాను. 
 
తన పేరు మీద ఆస్తి పత్రాలు రాయమని మహాలక్ష్మి కిరణ్‌కి చెప్తుంది. కిరణ్‌ అలా కుదరదు అని అంటాడు. జనార్థన్‌ గారికి అడగాలి అంటాడు. ఆయనకు తెలీకుండా ఒక్క అక్షరం కూడా మార్చను అని అంటాడు. ఇంతలో జనార్థన్, గిరిధర్‌లు రావడం మహాలక్ష్మి ప్లేట్ తిప్పేస్తుంది. కిరణ్‌ని కొట్టి నమ్మి మ్యానేజర్‌గా ఉండాల్సిన వీడు మన ఇంటికే అల్లుడు అయిపోవాలి అని చూస్తున్నాడు అని రేవతికి లైన్ వేస్తున్నాడు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: ఎట్టకేలకు రాజ్ మనసులో చోటు సంపాదించుకున్న 'బ్రహ్మముడి' కావ్య గురించి ఈ విషయాలు తెలుసా!