Trinayani Today Episode వల్లభ గంటలమ్మ దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వచ్చిన లలితాదేవి ఎలా కనిపించిందని వల్లభను గంటలమ్మ అడుగుతుంది. దానికి వల్లభ చేతికి గాయంతో వచ్చిందని అంటాడు. అప్పుడు గంటలమ్మ కుడి చేయినే కదా అని లలితాదేవినే తిలోత్తమ అనే అర్థం వచ్చేలా చెప్తుంది. 


గంటలమ్మ: కుడి చేయి కనిపించకుండా మీ పెద్దమ్మ అని నమ్మించింది అంటే..
వల్లభ: నమ్మించడం ఏంటి. అంటే..
గంటలమ్మ: అవునురా లలితాదేవిలా వేషం మార్చుకొని వచ్చిందిరా మీ అమ్మ. మీ రెండో పెద్దమ్మ గాయత్రీదేవిని పట్టుకోవడానికి ఆ వేషంలో రాగలిగింది. ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టకు. 


లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ రెడీ అవుతుంటుంది. వల్లభ అక్కడికి వచ్చి మమ్మీ అంటాడు. నువ్వు మా మమ్మీవే అని నన్ను అరే తురే అంటున్నావ్ అని.. మా మమ్మీవి కాబట్టే రాత్రి పూట నగలు సర్దుకుంటున్నావ్ అని వల్లభ అంటాడు. దానికి లలితాదేవి తిలోత్తమ వాయిస్‌లో తలుపు భద్రంగా వేశావు కదా అని అంటుంది. 


తిలోత్తమ: లలితాదేవి రూపంలో.. ఎవరూ కనిపెట్టలేదు కదా నువ్వు ఎలా కనిపెట్టావ్.
వల్లభ: గంటలమ్మని కలిశాను తాను చెప్పింది. ఇప్పుడు నాకు నీ గురించి తెలిసింది కదా మమ్మీ నేను ఎవరికైనా చెప్తే.
తిలోత్తమ: ఇప్పటి వరకు నయని, విశాల్ ఎవరికీ తెలీదు. నీ పెంకితనంతో నా కష్టాన్ని బూడిద పాలు చేయకు. 
వల్లభ: లేదులే మమ్మీ. అయినా అచ్చం పెద్దమ్మలానే ఉన్నావు. నీకు ఎవరో బాగా మేకప్ వేశారు. 
తిలోత్తమ: మేకప్ వల్ల వచ్చిన రూపం కాదు సాధన వల్ల వచ్చింది. నెలలో ఒక్కసారి మాత్రమే రూపం మార్చుకునే అవకాశం ఉంటుంది. పౌర్ణమి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రయోగం చేయగలం. రెండు రోజులు మాత్రమే మ్యానేజ్ చేయొచ్చు. మూడో రోజు అసలు రూపం వచ్చేస్తుంది. గతంలో లలిత అక్క చేయి తెగి రక్తం మరకలు తీసుకున్నాం కదా. ఆ మరకల వల్లే ఈ రూపం సాధ్యమైంది. 
వల్లభ: దేని కోసం మమ్మీ ఇదంతా.
తిలోత్తమ: నా శత్రువు గాయత్రీ అక్కయ్యని పట్టుకోవడానికి.
వల్లభ: అందుకేనా మధ్యాహ్నం పూజ పెట్టింది.



నయని, విశాల్, హాసినీలు గార్డెన్‌లో కలుసుకుంటారు. లలితాదేవి కంపెనీ ఫైల్స్‌, ఆస్తికి సంబంధించినవి అడిగారు అని చెప్పుకుంటారు. లలితాదేవి ఎందుకు అలా అడుగుతారని నయని అనుమాన పడుతుంది. ఇక పెద్దమ్మకి ఎందుకు ఊరికే చిరాకు వస్తుందని విశాల్ అంటాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. నయని మాట్లాడుతుంది. కాల్ మాట్లాడుతూ కాస్త కంగారు పడుతుంది. ఫోన్‌లో పెద్దమ్మగారి  గురించి అలా చేప్తారేంటి అని నయని అనుకుంటుంది. ఇంతలో నయనికి తాను లలితాదేవికి గన్ గురిపెట్టినట్లు కనిపిస్తుంది. పెద్దమ్మగారికి గన్ గురిపెట్టడం ఏంటా అని నయని ఆలోచిస్తుంది. 


నయని: అక్క, బాబుగారు ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి. తీసుకెళ్లి లాకర్‌లో పెట్టి వస్తాను. 
హాసిని: పెద్దత్తయ్యగారు అడిగారు కదా చెల్లి.
నయని: ఎవరికీ ఈ ఫైల్స్ చూపించాల్సిన అవసరం లేదు. నాకు కుడి కన్ను అదురుతుంది బాబుగారు. నష్టం జరగకూడదు అంటే ఈ పని కాస్త వాయిదా వేయడం మంచింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెమ్మని ఎందుకు అంటారు. అది తెలుసుకోండి ముందు.
విశాల్: నయనికి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. 
తిలోత్తమ: లలితాదేవి రూపంలో.. నిన్ను పట్టుకుందామని ఈ వేషంలో వచ్చినా నీ పునర్జన్మ ఆనవాళ్లు తెలీకుండా బాగానే జాగ్రత్త పడుతున్నావ్ గాయత్రీ అక్క. (గాయత్రీ పాప వస్తుంది.) గాయత్రీదేవి అని పేరు పెట్టుకున్న ఈ పిల్ల వల్లనే గాయత్రీ అక్క ఆత్మగాని తన పునర్జన్మ ఆనవాళ్లు తెలుస్తాయి అని గంటలమ్మ చెప్పింది. కానీ ప్రతీ సారి ఏదో ఒక కారణం వల్ల తెలియడం లేదు. ముందు ఈ పాపని బయటకు పంపేయాలి. అంటూ పాపని పట్టుకోబోతే హాసిని వచ్చి వంట చేశాను అని హడావుడి చేస్తుంది. 


నయని వచ్చి లలితాదేవికి గన్ గురి పెడుతుంది. అందరూ నయని లలితాదేవికి గన్ గురిపెట్టిందేటా అని షాక్ అవుతారు. విశాల్ అయితే నయని మీద సీరియస్ అవుతాడు. పెద్దమ్మగారు లలితాదేవి గారిని షూట్ చేయాలి అనుకుంటున్నాను అని నయని అంటుంది. లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ నయనిని ప్రశ్నిస్తుంది. దాంతో నయని ఒత్తి పలికి మాట్లాడుతుంది. దాంతో తిలోత్తమ తన రూపాన్ని గుర్తు పట్టినట్లు ఉందని లలితాదేవిలా ఉన్న తిలోత్తమ అనుకుంటుంది. ఎవరు అడ్డు వచ్చినా కాల్చేస్తా అని నయని అంటుంది. నయని గన్ పట్టుకొని లలితాదేవి దగ్గరకు వెళ్తుంది. వద్దు వద్దు అని లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ అంటుంది. అడ్డు వస్తే నా భర్తని కూడా కాల్చేస్తా అని అంటుంది. నయని లలితాదేవి చెవి దగ్గరకు వెళ్లి..



నయని: నీ మారు వేషాన్ని నేను కనిపెట్టగలిగాను తిలోత్తమ అత్తయ్య. లలితాదేవి పద్ధతి నడవడికా వేరు. కట్టుబొట్టుతో బాగానే మ్యానేజ్ చేయగలిగావు కానీ క్యారెక్టర్ విషయంలో దొరికిపోయావి. నువ్వు వేసిన ముగ్గు, నీ మాటలు అన్నీంటిలో నాకు దొరికిపోయావ్ ఆ తర్వాత ఆధారాలు దొరకడం చకచకా జరిగిపోయావి. మలేషియా వెళ్లానని చెప్పావ్. ఎంక్వైరీ చేస్తే ఆవిడ వెళ్లలేదు అని తెలిసింది. ఆవిడ రేపు ఇక్కడికి వస్తున్నారు ఈలోపు వేషం మార్చి ఇక్కడికి వచ్చావా సరే సరి. లేదంటే మా ఇద్దరిలో ఎవరో ఒకరు నిన్ను చంపడం ఖాయం. 
తిలోత్తమ: వెళ్లిపోతాను.
నయని: మళ్లీ రావాలి.
తిలోత్తమ: వస్తాను.  ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: పైరసీ కాపీ చూసినట్టు ఉంది - ‘కల్కి 2898 AD’ 3D ప్రింట్‌పై ప్రేక్షకుల కామెంట్స్