Nirupam Paritala Review On Kalki 2898 AD: నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’కు మామూలు ఆడియన్స్ మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. చాలామంది సినీ స్టార్లు తమ బిజీ షెడ్యూల్స్ వల్ల ఇంకా ఈ మూవీని చూడలేదు. కానీ చూసినవాళ్లు మాత్రం దీని గురించి ఒక రేంజ్‌లో రివ్యూలు ఇస్తున్నారు. అందులో ‘కార్తీకదీపం’ డాక్టర్ బాబు కూడా ఒకరు. తాజాగా డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్.. ఈ సినిమాను చూశాడు. చూడడం మాత్రమే కాదు.. ‘కల్కి 2898 AD’ గురించి ఒక వివరమైన రివ్యూను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నిరుపమ్ రివ్యూ బాగుందంటూ ఆడియన్స్ ఫీలవుతున్నారు.


కన్‌ఫ్యూజన్ లేదు..


‘స్టోరీలో కన్‌ఫ్యూజన్ లేదు, క్రియేషన్‌లో కన్‌ఫ్యూజన్ లేదు. డైరెక్షన్‌లో కన్‌ఫ్యూజన్ లేదు. ఎగ్జిక్యూషన్‌లో కన్‌ఫ్యూజన్ లేదు. పాత్రలు బలంగా ఉన్నాయి. ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మరింత బలంగా ఉంది. క్లైమాక్స్ అయితే గూస్‌బంప్స్. లెజెండ్స్ అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్‌లు అద్భుతం. ప్రభాస్, దీపికా పదుకొనె స్టన్నింగ్‌గా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్‌ను మన మైథలాజీతో సరిగ్గా కలిపారు. ఆన్ స్క్రీన్‌పై విజువల్స్ చాలా బాగున్నాయి. సౌత్ ఇండియా నుండి మరో గర్వమైన ఇండియన్ సినిమా. ఇది వన్ మ్యాన్ షో’ అంటూ యాక్టర్ల దగ్గర నుండి టెక్నీషియన్ల వరకు ప్రతీ ఒక్కరిని ప్రశంసల్లో ముంచేశాడు నిరుపమ్.


అద్భుతాలు సృష్టిస్తుంది..


‘నాగ్ అశ్విన్‌కు తలవంచాల్సిందే. వైజయంతీ మూవీస్‌, స్టార్ మేకర్స్ అయిన స్వప్న దత్, ప్రియాంక దత్‌ల కెరీర్‌లో మరో వజ్రం వచ్చి చేరింది. కచ్చితంగా ఇది అద్భుతాలు సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ అద్భుతాన్ని తెరపై చూడాల్సిందే’ అంటూ ‘కల్కి 2898 AD’ను చూడమంటూ ప్రేక్షకులకు రికమెండ్ చేశాడు నిరుపమ్. ఇక సినిమాతో పాటు నిరుపమ్ రివ్యూను కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా భలే చెప్పావ్ అంటూ, మీ రివ్యూ చాలా వివరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ మూవీ గురించి బెస్ట్ రివ్యూ ఇచ్చినవారిలో నిరుపమ్ ఒకరని అంటున్నారు.






అన్ని భాషల్లో..


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’.. మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల అవ్వని భాషల్లో ఈ మూవీ విడుదలయ్యింది. అలా ప్రతీ భాష నుండి ‘కల్కి 2898 AD’కు పాజిటివ్ రివ్యూలే అందుతున్నాయి. ప్రభాస్ మాత్రమే కాకుండా ఇందులోని ప్రతీ ఒక్కరు బాగా యాక్ట్ చేశారని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుల గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని అంటున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’.. మొదటి రోజు కలెక్షన్స్‌తోనే ఎన్నో రికార్డులు తిరగరాసేలా ఉందని అంచనా వేస్తున్నారు.



Also Read: వారం రోజుల వరకు నా గొంతు పనిచేయదు - ‘కల్కి 2898 AD’పై రేణు దేశాయ్ రివ్యూ