Kalki 2898 AD Review: కొన్ని సినిమాలు ఎలా చూసినా, ఏ థియేటర్లలో చూసినా బాగానే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలను నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే 3dలో చూడాల్సిందే. అలాంటి సినిమాల్లో తాజాగా విడుదలయిన ‘కల్కి 2898 AD’ కూడా ఒకటి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్ ఈ మూవీని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అందుకే దీనిని 2dలో చూసి తృప్తిపడని చాలామంది ప్రేక్షకులు.. 3dలో మరోసారి చూడడానికి సిద్ధమయ్యారు. కానీ ‘కల్కి 2898 AD’ని అలా 3Dలో చూసిన ఒక ప్రేక్షకుడు.. దీని గురించి ఘోరమైన నెగిటివ్ రివ్యూ ఇస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒరేయ్ నాగ్ అశ్విన్..
‘‘ఒక పైరసీ కాపీని థియేటర్‌లో చూస్తున్నట్టు ఉంది’’ అంటూ ‘కల్కి 2898 AD’ను థియేటర్‌లో చూసిన ఒక ప్రేక్షకుడు కామెంట్ చేశాడు. అంతే కాకుండా ఆ ఫోటోను తీసి షేర్ చేశాడు. మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ‘‘600 కోట్లు ఏం చేసారురా’’ అంటూ ఫైర్ అయ్యాడు. అయితే సినిమా బాగుందని అంతటా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఇది థియేటర్ స్క్రీన్ తప్పు కూడా అయ్యిండవచ్చని ప్రేక్షకుడికి డౌట్ వచ్చింది.
తప్పనిసరి చూశాం..
‘కల్కి 2898 AD’పై అతడు ఒక్కడే కాకుండా ఆ థియేటర్‌లో సినిమాను 3Dలో చూసినవారంతా కూడా దాదాపుగా ఇదే రివ్యూ ఇచ్చారు. ఇది తమ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాదని.. దాదాపుగా ఆ థియేటర్‌లో ఉన్నవారంతా కూడా 3Dలో సినిమాలో బాలేదనే ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. టికెట్ కొన్నారు కాబట్టి, సినిమాను పూర్తిగా చూడాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చివరివరకు చూశామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఆ థియేటర్‌లో ‘కల్కి 2898 AD’ చూసినవారంతా ఇంత ఘోరమైన రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. వేరే థియేటర్లలో 3Dలో మూవీ చూసినవారంతా వారి ఎక్స్‌పీరియన్స్ బాగుందని అన్నారు.
పాజిటివ్ టాక్..
‘కల్కి 2898 AD’ కోసం ఉదయం 4 గంటల నుండే బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. అలా మొదటి షో నుండే ‘కల్కి 2898 AD’ పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక సినిమా చూసినవారంతా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని, వింటేజ్ ప్రభాస్ కామెడీని చూశామని ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ‘కల్కి 2898 AD’ విడుదలకు ముందే మేకర్స్ అంతా ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేయడంతో ఫస్ట్ డే మాత్రమే కాకుండా ఫస్ట్ వీకెండ్ వరకు కూడా దాదాపుగా చాలా థియేటర్లలో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. కొందరు అయితే ఈ మూవీని మళ్లీ మళ్లీ ఆన్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని వరుసగా షోలకు వెళ్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది.
Also Read: చిరిగిన చెప్పుల ఫోటో పెట్టిన నాగ్ అశ్విన్ - ‘కల్కి 2898 AD’ కోసం తాను పడిన కష్టానికి ఇదే నిదర్శనం