Deepika Padukone's First Telugu Movie: దీపికా పదుకొణె. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. హాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. ఈ మధ్య సౌత్ లోనూ ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమాలో సుమతి పాత్రలో అద్భుత నటన కనబర్చింది. కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరుగుతుంది. డీ గ్లామరస్ గా కనిపించినా పవర్ ఫుల్ రోల్ చేసింది. ఈ మూవీతో దీపికా మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నది.   


దీపికా నటించిన తొలి తెలుగు సినిమా ఏదంటే?


చాలా మంది సినీ అభిమానులు ‘కల్కి 2898 ఏడీ’ దీపికా పదుకొణె నటించిన తొలి తెలుగు సినిమా అనుకుంటున్నారు. అయితే, ఇందులో వాస్తవం లేదు. ఆమె ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేసింది. ఇంతకీ ఆమె చేసిన తెలుగు సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఈ సినిమా విడుదల కాలేదు. 2009లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘లవ్ 4 ఎవర్’ అనే సినిమా మొదలయ్యింది. ఈ సినిమాతో దీపికా పదుకొణె టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రణదీప్, మృదుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో దీపికా స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే, పలు కారణాలతో ఈ సినిమా విడుదల కాలేదు. సుమారు 15 సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటించింది. ఆమె నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు సినిమా మాత్రం ‘కల్కి 2898 ఏడీ’ కావడం విశేషం.


‘కల్కి 2898 ఏడీ’లో అగ్ర నటీనటులు


ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో పలువురు అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్, దీపికా పదుకొణె హీరోయిన్లుగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ఎపిక్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యింది. 2D, 3D, IMAXతో పాటు 4DX ఫార్మాట్లలో అందుబాటులోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.   


Read Also: 'కల్కి 2898 ఏడీ' హిందీ డిజిటల్ రైట్స్‌లో ట్విస్ట్ - రెండు ఓటీటీల్లో Prabhas సినిమా!



Also Read'కల్కి 2898 ఏడీ' రివ్యూ: సినిమా విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా? ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?