శివుడితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో "శివుడిని" ప్రసన్నం చేసుకునేందుకు ఏళ్లతరబడి తీవ్రమైన తపస్సు చేస్తాడు ద్రోణుడు. అలా శివుడి అనుగ్రహంతో ద్రోణాచార్య, కృపి దంపతుల జన్మిస్తాడు అశ్వత్థామ. శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా వినిపించడంతో అశ్వత్థామ అని పేరుపెట్టారు. నుదుటిపై మణితో పుట్టిన అశ్వత్థామకి  ఆ మణి నుదిటిపై ఉన్నంతవరకూ ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు, నాగుల వల్ల కానీ  ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. 


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
అసలు విషయానికొస్తే... మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడిని నిలువరించేందుకు కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు.. తర్వాత కుంజరహః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి అక్కడ చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ హతః అనే మాట నమ్మిన ద్రోణుడు ... కొడుకు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు (అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు). ఇదే అదనుగా ధృష్ట్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ని హతమొందిస్తాడు. అయితే తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో.. పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికనట్టు మట్టుబెడతాడు. యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తుండగా  దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో ఉప పాండవులు సహా వారి సన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. 


Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
తండ్రిని చంపారన్న కోపంతో అశ్వత్థాముడు పాండవులపై ఎగబడితే.. కొడుకులను చంపాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురుతిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్తాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు.. వాటిని వెనక్కు తీసుకోవాలని సూచిస్తారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్తాన్ని వెనక్కు తీసుకోలేక  అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడగా కృష్ణుడు రక్షిస్తాడు. ఆ సమయంలో అశ్వత్థాముడిని శపించిన కృష్ణుడు   కుష్టు వ్యాధితో 3 వేల ఏళ్లపాటు ఒంటరిగా బతకమంటాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము, నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అందుకే సప్త చిరంజీవుల్లో అశ్వత్థాముడి పేరు కూడా చెబుతారు.


అప్పటి నుంచే అశ్వత్థామ హతః కుంజరహ అనే పదం వినియోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజకీయనాయకులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంటే తమకు పనికి వచ్చే భాగాన్ని మాత్రం ప్రచారంలో పెట్టి.. దానికి అసలుకంటె భిన్నమైన అర్థం వచ్చేలా ప్రజల మనసుల్లోకి నెట్టి..  అనుచితమైన ప్రయోజనం ఆశించడం కోసం ఇలా చేస్తారనే ప్రచారం ఉంది. 


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి