Maha Shivaratri 2025

అక్షర శరీరుడైన పరమేశ్వరుడి స్వరూపం గురించి మీకు తెలుసా! 'అ'కారం పరమేశ్వరుని శిరస్సు

'ఆ'కారము లలాటము (నుదురు)

'ఇ'కారము కుడి కన్ను

'ఈ'కారము ఎడమ కన్ను

'ఉ'కారము కుడి చెవి

'ఊ'కారము ఎడమ చెవి

'ఋ'కారము  కుడి చెక్కిలి

'ౠ'కారము ఎడమచెక్కిలి

'అలు, అలూ' కారాలు రె౦డు ముక్కుపుటములు

'ఏ'కారము పై పెదవి

'ఐ'కారము ఈశ్వరుని క్రి౦ది పెదవి

'ఓ'కారము పై పలువరుస

శివునికి 'అ౦ అః 'అనునవు (దవడలు) 

వీటికి ప్రాణాక్షరములు అని పేరు

'క' వర్గంలో ఐదు అక్షరాలు (క ఖ గ ఘ జ్ఞ) ఐదు కుడి చేతులు 

'చ'వర్గంలో ఐదు అక్షరములు ఐదు ఎడమ చేతులు

'ట'వర్గంలో ఐదు, తవర్గలో ఐదు ఈ పది అక్షరాలు పాదాల వేళ్లు 

'ప'కారము పొట్ట, 'ఫ'కారము కుడి పార్శ్వము

'బ'కారము ఎడమ పార్శ్వము 'భ'కారము స్క౦ధం 

మహాదేవుడి  హృదయమే మకారం 

యకారం మొదలు సకారము వరకు ఉండే 7 అక్షరాలు ఏడు ధాతువులు (చర్మం, రక్తం, మా౦సం, అస్తి, కొవ్వు, మజ్జ, శక్ర౦) 

'హ' కారము నాభి  

'క్ష'కారము ఘ్రాణే౦ద్రియం

వీటికి ప్రాణ్యక్షరాలు అని పేరు

Also Read: ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

మంత్రం ద్వారా ఉత్పన్నమయ్యై చైతన్యమే దేవుడు...సర్వదేవతలూ మంత్రాధీనులు..అన్ని మంత్రాలు అక్షరాధీనాలే. అన్ని అక్షరాలు ఓంకార స్వరూపమేఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు..సర్వ మంత్ర మయుడు, అక్షరమయుడు

అందుకే అంటారు...

ఈశాన్ సర్వ విద్యానాం! ఈశ్వర సర్వ భూతానాం! అని.. 

ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ మానవాతీత శక్తి  లేదంటే భగవంతుని నియంత్రణలో ఉంటుంది. అందులో మనకి అవసరమైనవి మాత్రమే మనం గ్రహించి  మిగిలిన వాటిని తక్కినవాటిని వదిలేయాలంటూ ఈ శ్లోకం చెబుతారు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజితా మా గృధ: కస్య స్విద్ ధనం

అంటే ఈ జగత్తులో ప్రతిదీ ఈశ్వరుడితోనే నిండి ఉందని అర్థం.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే ఇదే మరి. పుట్టుక నుంచి మరణానంతరం చేరుకునే శ్మశానం వరకూ మన ప్రతి చర్య, నేర్చుకునే ప్రతి విద్యలోనూ శివుడున్నాడు.

Also Read: విష్ణువుకే కాదు శివుడుకీ దశావతారాలున్నాయి - అవేంటంటే!

సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష..అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14  సూత్రాలు ఢమరుక నాదం నుంచి సృష్టించాడు శంకరుడు

యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయింది శివుడే

సంగీత విద్యకు మూలమైన సప్తస్వరాలు... షడ్జమం(నెమలి) ,రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం) ,పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు), ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతాన్ని ఆవిష్కరించాడు

‘శివ తాండవం’ ద్వారా ‘నృత్యం’ అందించాడు

ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని తెలియజేస్తూ అలాగే జీవించి చూపించాడు

పార్వతీదేవికి తన శరీరంలో సగభాగం ఇచ్చి.. గంగను తలపై మోసి స్త్రీకి గౌరవం ఇచ్చి ఆచరించమని చెప్పాడు

శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే అంటూ తంత్ర విద్య ప్రవేశపెట్టాడు

గుణహీనుడు, నిర్గుణుడు అన నిందించిన దక్ష ప్రజాపతి మాటలకు తగ్గట్టే ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు

Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!