Lord Venkateswara Swamy Archives: గోవింద అంటే కోటి పాపాలు పోతాయని పెద్దలు చెబుతారు.. గోవిందుడుని సేవిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సప్తగిరుల్లో వెలసిన గోవిందుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.  తిరుపతి కి అతి సమీపంలో రామచంద్రాపురం మండలం నడవలూరు పంచాయితీ నెన్నూరు వద్ద తిరుమల శ్రీవారే స్వయానా స్నానం ఆచరించి తిరునామాలు ధరించి ప్రాంతం నామాల కాలువ అని గ్రామస్తులు చెబుతున్నారు. 

శ్రీవారు స్నానం చేసిన ఈ నామాల కాలవ దగ్గర ఈమధ్య పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. ఈ విగ్రహం పై  స్వామి వారి పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌని అమావాస్య రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ఈ విగ్రహాలు వెలుగుచూశాయి. 

Also Read: విష్ణువుకే కాదు శివుడుకీ దశావతారాలున్నాయి - అవేంటంటే!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు అనుక్షణం పాటు చూస్తే చాలని తపించే భక్తులకు  స్వామి వారు కల్యాణం చేసుకుని వెళ్లే క్రమంలో స్నానమాచరించిన పుణ్యస్థలాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు నెన్నూరు గ్రామస్తులు . 

పూర్వం నారాయణవనంలో శ్రీనివాసుడు వివాహం చేసుకుని అప్పలాయగుంట మీదుగా యోగుల పర్వతం మీద కాలుమోపారు. అక్కడ స్వామి వారి పాదాలు ఉన్నాయి. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఈ నామాల కాలువలో స్నానమాచరించి నామాలు ధరించి శ్రీనివాసమంగాపురం చేరుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ చిన్నపాటి ఊటగా పుట్టే నీరు చాల స్వచ్చంగా తేటగా కనిపిస్తాయని అంటున్నారు. ఇక్కడ నుంచి ప్రవాహం పెద్ద గా మారి స్వర్ణముఖి నదిలో కలుస్తుందని, ఈ కాలువ వల్ల సాగు, తాగు నీటికి సమీప గ్రామాలకు కొదవ లేదని అంటున్నారు. పూర్వం ఈ కాలువ ఒడ్డున ఉండే చెట్ల కింద శ్రీవారి శిలారూపం ఉండేదట. ఆ తర్వాత వచ్చిన వరదల్లో ఆ విగ్రహం నీటిలో కొట్టుకుపోయిందని చెబుతారు. ఆ తర్వాత కొన్నేళ్లకు   నడవలూరు ప్రాంతంలో పాదాలు లేని విగ్రహం లభ్యం కావడంతో ఓ ఆలయం ముందు బిల్వ చెట్టు కింద పెట్టి పూజలు చేస్తున్నారు.

Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!

కార్తీకమాసం సహా ఇతర పుణ్యదినాల్లో పుణ్యస్నానాలు ఆచరించేవారమని...కరోనా సమయంలో భక్తులెవరూ రాకపోవడంతో ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వాధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేలా ఈ ప్రదేశాన్ని మార్చి..ఇక్కడ స్వామివారికి చిన్న ఆలయం నిర్మించడం ద్వారా ఇది కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నారు. 

Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!

 శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం 

శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకంశ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ--న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

నందగోపనందనం సనందనాదివందితంకుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 

నాగరాజపాలనం భోగినాథశాయినంనాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 

తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం--విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |తారకాసురాటవీకుఠారమద్వితీయకంనాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 

ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |