Tirumala Srivani Darshanam: తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. జూలై 31 వరకూ శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి మూడు రోజులు పట్టేది. కానీ ఆగష్టు 1 నుంచి ఏ రోజు టికెట్‌ తీసుకుంటే ఆరోజే దర్శనానికి వీలు కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. ఆగస్టు 1 నుంచి ఆగష్టు 15వ తేదీ వరకు రెండు వారాల పాటూ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.  ఈ మేరకు  ఈ రోజు అయితే ఉదయాన్నే ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్‌ తీసుకుంటారో ఆ భక్తులు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది TTD. శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి  మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఇచ్చినట్టే తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదట వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుంది.  తిరుమలలో 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా అక్టోబర్‌ 31 వరకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు.. యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం ఉంటుంది. 

ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 

ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి

ఆగష్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్సవాలకు అంకురార్పణ 

ఆగష్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమై ఆగష్టు 07న ముగుస్తాయి

ఆగష్టు 8న తిరు నక్షత్రం

ఆగష్టు 9న శ్రావ‌ణ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తారు

ఆగష్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేస్తారు

ఆగష్టు 16న గోకులాష్టమి ఆస్థానం జరుగుతుంది

ఆగష్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధి నశిక్యోత్సవం 

ఆగష్టు 25న బ‌ల‌రామ జ‌యంతి, వ‌రాహ‌ జ‌యంతితో పర్వదినాలు జరుగుతాయి

వేంకటేశ్వర వజ్రకవచం

మార్కండేయ ఉవాచ |నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || 

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు |ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ||  

ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు |దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః || 

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ||  

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః |సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || 

ఇతి మార్కండేయ కృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం |

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి...12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

 శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి