Nuvvunte Naa Jathaga Serial Today Episode  దేవా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మిథున గుడి నుంచి వచ్చి దేవా దగ్గరకు పరుగులు తీసి దేవాకి బొట్టు పెడుతుంది. మిథున తన గురించి ఇంతలా ఆలోచిస్తుందేంటి అని అనుకుంటాడు.

మిథున వెంటనే నేనేంటి నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నానేంటి అనుకుంటున్నావు కదా దేవా.. ఇదంతా తాళి కోసం అని అంటుంది. నేను బంధాన్నిమాత్రమే కాదు.. నిన్ను కూడా నమ్మాను.. నా బంధం గెలిచింది.. నా నమ్మకం కూడా గెలిచింది. దేవా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావ్. నువ్వు బంగారం.. నాకు దేవుడు ఇచ్చిన వరం. రౌడీ అనే ఒక్క మాట తీసేస్తే భూమ్మీద నీ కంటే మంచోడు ఉండడు తెలుసుకో అని అంటుంది. దేవా ఆలోచనలో పడతాడు. ఏంటి ఏమైనా చెప్పాలా నేను వెయిట్ చేస్తున్నా అని మిథున అడుగుతుంది.

దేవా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో కంగ్రాట్స్ అంటూ ఆదిత్య బొకేతో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఆదిత్య అని మిథున అనగానే ఇద్దరి చేతిలో బొకే పెడతాడు. నువ్వు అనుకున్నది సాధించావ్ మిథున.. భయ్యా మిథునని కాపాడటం ఒకటైతే నువ్వు ఇక్కడి వరకు వస్తావని అస్సలు ఊహించలేదు భయ్యా.. ఊహించనిది జరగడమే కదా అద్భుతం అంటే.. నువ్వు ఇంకా ఇంకా అద్భుతాలు చూస్తావు భయ్యా.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని ఆదిత్య తనలోనే విలనిజం చూపిస్తాడు. దేవా ఆదిత్యతో ఏంటి భయ్యా మధ్య నీ మాటల్లో తేడా కనిపిస్తుంది అని అంటాడు. నీకు అలా అనిపిస్తుంది భయ్యా.

భయ్యా పైకి ఇంత హ్యాపీగా చెప్తున్నా కానీ లోపల మాత్రం అగ్నిపర్వతం అంత బాధ రగులుతుంది. నా ప్రాణం, నా సర్వస్వం అన్నీ మిథునే అనుకున్నా.. తను నా భార్య అయిపోయిందని కలలు కన్నా.. కానీ మిథున నా భార్య కాలేకపోయిందని బాధ ఉన్నా మిథున గెలివాలి అని ఇక్కడికి వచ్చి.. మిథున నువ్వు అద్భుతం.. అపురూపం..నీ లాంటి భార్య దొరకాలి అంటే అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం దొరికినట్లే దొరికి మిస్ అయిపోయింది. నేను చాలా దురదృష్టవంతున్ని అని బాధగా లోపలికి వెళ్లిపోతాడు. మిథున బాధగా చూస్తుంది. మిథునని దేవా చూస్తాడు.

శ్రీరంగం ఇంటిని అమ్మేయడానికి బేరం తీసుకొస్తాడు. అది చూసి ఆనంద్, ప్రమోదిని, శారద బయటకు వస్తారు. ఆయన కొంటాను అనడం చూసి శారద శ్రీరంగాన్ని ఎవరు ఆయన అని అడుగుతుంది. ఆనంద్కూడా ఎవరు అని ప్రశ్నిస్తాడు. దానికి సూర్యకాంతం మన ఇంటిని కొనడానికి వచ్చారని అంటుంది. ఇంటిని బేరానికి పెట్టారా అని ఆనంద్ అంటాడు. అవును అని శ్రీరంగం అనడంతో ఇళ్లు అమ్మడం ఏంట్రా అని శారద నోరెళ్ల బెడుతుంది. ఇళ్లు అమ్మేసి మా వాటా తీసుకొని వెళ్లిపోతాం అని సూర్యకాంతం అంటుంది. ఆనంద్రంగం కాలర్ పట్టుకొని ఇళ్లు అమ్మేస్తావా అని తిడతాడు. ఇంతలో సత్యమూర్తి వచ్చి కొడుకుల్ని ఆపుతాడు. ఏం చేశారా అని అడుగుతాడు. ఇళ్లు ఆమ్మేస్తున్నాడు నాన్న అని ఆనంద్ చెప్తాడు. సేటు వచ్చి ఇళ్లు ఓకే అడ్వాన్స్ ఇస్తాను అంటే సత్యమూర్తి ఇళ్లు అమ్మడానికి కట్టుకోలేదు నా కలల ప్రపంచం ఇది నేను చచ్చినా ఇళ్లు అమ్మను అని అంటుంది.

సూర్యకాంతం భర్తతో విన్నావా మీ ఆయన చచ్చినా ఇళ్లు అమ్మరంట ఆయన చచ్చేవరకు మనం చచ్చినట్లు ఇక్కడ ఉండాల్సిందే అంటుంది. కాంతం మాటలకు అందరూ బిత్తరపోతారు. సత్యమూర్తికి ఆయాసం వచ్చి కూలబడిపోతాడు. మరోవైపు దేవా ప్రతీ రోజు రాత్రి అవ్వగానే గ్యారేజ్లో నాలుగు పెగ్గులు వేసి కబుర్లు చెప్పుకోవాల్సిందే ఇప్పుడు ఇలా గదిలో బందీగా ఉండటం నా వల్ల కాదు బయటకు వెళ్లాల్సిందే అని అనుకొని బయటకు వెళ్తుంటే మిథున జ్యూస్తో ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడికి అని అడుగుతుంది. బయట చల్లగాలి అని దేవా అంటాడు. దానికి మిథున వెళ్లి మందు తాగొస్తావా అని అడుగుతుంది. సరే జ్యూస్ తాగు అంటుంది. ఇలాంటివి నా వల్ల అస్సలు కాదు అంటాడు. టైంలో నువ్వు ఏం తాగుతావో నాకు తెలుసు అనగానే దేవా సంతోషపడతాడు. నేనేం తీసుకురాలేదులే నేను నీ అలవాట్లను కాదు అనను కానీ ఇక్కడ అందరూ నిన్ను కంట కనిపెడుతూనే ఉంటారు. చిన్న తప్పు చేస్తావా అని ఎదురు చూస్తున్నారు. నువ్వు తప్పుగా దొరికితే నా ప్రయత్నం వృథా అయిపోతుంది. మా నాన్నకి మందు తాగేవాళ్లు అంటే ఇష్టం ఉండదు. నా కోసం ఇక్కడున్నన్నాళ్లు వద్దు ప్లీజ్. లైఫ్లో కొన్ని అవకాశాలు అవి కోల్పోతే జీవితాంతం తిరిగిపొందలేం మనకు వచ్చిన అవకాశం ఇప్పుడు పొగొట్టుకోవద్దు ప్లీజ్ దేవా అని జ్యూస్ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఆదిత్య ఇంట్లో ఏడుస్తాడు. అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు. ఏడ్వొద్దురా అని త్రిపుర ఏడుస్తుంది. ఎలా అక్క మిథునతో నా జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను కానీ శుభలేఖల్లో పేర్ల దగ్గర మా బంధం ఆగిపోయింది. నేను కూడా ఏడ్వకూడదు అనుకుంటున్నా కానీ నా మనసు ఏడుస్తుంది. తను నా మనసులో ఉందక్కా. మిథున నా భార్య అక్క నా భార్య.. పరిస్థితులు అన్నీ చేయి జారిపోయిన సరే మామయ్య నాకు మాటిచ్చారు కదా ఎప్పటికైనా మామయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఉన్నాను అని అంటాడు. త్రిపుర మామయ్య దగ్గరకు వెళ్లి మీరు అంటే వాడికి ఎంతో అభిమానం.. మిమల్ని చూసి వాడు లాయర్ అయ్యాడు. కూతుర్ని వాడికి ఇస్తానని మీరే చెప్పి ఆశలు పెంచారు. ఇప్పుడు ఇలా జీవితాంతం ఏడుస్తూ మిగిలిపోమని బాధ బహుమతిగా ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ మామయ్య అని వెళ్లిపోతుంది. త్రిపురని రాహుల్ బాధ పడొద్దని ఓదార్చుతాడు. మిథున కచ్చితంగా దేవాని మీ నాన్నకి నచ్చేలా చేస్తుంది. అందుకే వాడి వీక్ నెస్ మీద కొడదాం. నట్టింట్లో భీభత్సం చేద్దాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.