Ammayi garu Serial Today Episode రుక్మిణితో సూర్యప్రతాప్‌ నీ జీవితం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానమ్మా ఈ కోరికతో పాటు ఇంకో కోరిక ఉందమ్మా అని అంటాడు. ఏంటి అది అని రుక్మిణి అడిగితే కోరిక కంటే నాలో భయం అమ్మా నువ్వు రాజుని పెళ్లి చేసుకున్నప్పుడు బంటీకి తల్లి అయితే చాలు అనుకున్నా.. బంటీ మీద నువ్వు చూపించే ప్రేమ.. బంటీకి నువ్వు దగ్గరవుతున్న విధానం చూసి నువ్వు కూడా నా రూపవే అనుకున్నా.. బంటీకి అమ్మ ప్రేమ తప్ప సవతి తల్లి ప్రేమ తెలీకుండా చూసుకుంటావని నమ్మాను కానీ మొదటి సారి భయం వేస్తుందమ్మా.. అంటే నీకు రాజుకి పాపో బాబో పుడితే నా మనవడి మీద ప్రేమ తగ్గిపోదు కదమ్మా అని అడుగుతారు. 

రుక్మిణి కన్నీరు పెట్టుకొని లేదు అని తలూపుతుంది. నువ్వు సవతి తల్లిగా చూడవు కదమ్మా అని అడుగుతారు. రుక్మిణిలా ఉన్న రూప ఏడుస్తూ బంటీ నా కొడుకు నాన్న. మీకు అంత భయంగా ఉంటే నేను ఇంకో బిడ్డని కనడం మానేస్తాను అంటుంది. అయ్యో అల అనకమ్మా కానీ బంటీకి తల్లి ప్రేమని దూరం చేయకపోతే చాలు అంటారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా చేయను నాయనా. బంటీ నా తొలిసూరి బిడ్డ అని అంటుంది. ఇదే మాట మీద ఉంటానని మాటివ్వు తల్లి అంటారు. రూప మనసులో నేను రుక్మిణిగా ఉన్న ప్రతీ సారి మిమల్ని మోసం చేస్తున్నానని చాలా బాధేస్తుంది నాన్న అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ మాటివ్వమని అంటే నా కొడుకు గురించి నేను మాటిస్తే నేను తల్లిని ఎలా అవుతాను నాయనా.. నేను వాడి కన్న తల్లి  కాదనే భావనలో నేను లేను నాయనా అని రుక్మిణి ఏడుస్తుంది. సూర్యప్రతాప్‌ కన్నీరు పెట్టుకుంటాడు. వాడు పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమకి దూరంగా ఉన్నాడమ్మా.. నువ్వు వచ్చాక వాడికి తల్లి ప్రేమ దొరికింది.. ఇప్పుడు నీ మాటలకు నీకు ఎంత మంది పిల్లలు పుట్టినా వాడిని నీ మొదటి బిడ్డగా చూసుకుంటావనే నమ్మకం వచ్చిందమ్మా అని సూర్యప్రతాప్‌ వెళ్లి పోతాడు. రూప చాలా బాధపడుతుంది. 

రుక్మిణి, రాజులకు గదిలోకి తీసుకెళ్తుంటే ఇంట్లోకి ఓ అమ్మాయి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని చంద్ర అడిగితే నన్ను గుర్తు పట్టలేదా బాబాయ్‌ అంటుంది. సూర్యప్రతాప్‌ ఆమెతో అమ్మా ఏమైనా ఉంటే రేపు ఆఫీస్‌కి రామ్మా అని చెప్పి వెళ్లిపోతుంటే నాన్న అని పిలుస్తుంది. అందరూ షాక్ అయి చూస్తారు. సూర్యప్రతాప్‌ వచ్చి ఏమన్నావ్ అంటే.. నేను రూపని నాన్న.. అలా చూస్తున్నారేంటి నాన్న చచ్చిపోయిన రూప ఎలా తిరిగి వచ్చిందని చూస్తున్నారా.. లేక నా రూపం అలా లేదని చూస్తున్నారా. నేను బతికే ఉన్నాను నాన్న మీ కోసం బతికాను.. నన్ను చూసి నేనే నమ్మలేకపోయాను నాన్న మీరు నమ్మకపోవడంతో ఆశ్చర్యం ఏముంది అని అంటుంది. 

రూప రాజుతో ఎవరు రాజు నాలా నాటకం ఆడుతుంది అని అడుగుతుంది. ఇక రూప అంటూ వచ్చిన అమ్మాయి రుక్మిణి దగ్గరకు వెళ్లి అచ్చం నాలా ఉంది ఎవరు తను.. ఏయ్ ఎవరు నువ్వు.. నాలా ఉన్నావని నేను లేని టైం చూసి ఇక్కడున్నావా అని అడుగుతుంది. రాజు తనతో తన పేరు రూప ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఏంటి రైస్ పీస్ నువ్వు నన్ను గుర్తు పట్టడం లేదా.. నేను రూప నమ్మడం లేదా అసలు ఈ అవతారం ఏంటి శోభనం పెళ్లి కొడుకులా.. అంటుంది. అసలు ఎవరమ్మా నువ్వు అని విరూపాక్షి వెళ్తే అమ్మా అని విరూపాక్షిని హగ్ చేసుకుంటుంది. విరూపాక్షి ఆ అమ్మాయిని దూరం పెడుతుంది. 

విరూపాక్షితో నేను ఉన్నప్పుడు నిన్ను నాన్నని కలవాలి అనుకున్నా నువ్వు ఇక్కడ ఉన్నావంటే నాన్న నిన్ను అంగీకరించారా.. రాఘవ వచ్చి నిజం చెప్పాడా.. నాకు తెలుసు రైస్‌ పీస్ నేను అనుకున్నది నువ్వు చేస్తావని లవ్‌యూ లవ్‌యూ సోమచ్ అని రాజు చేయి పట్టుకొని అంటుంది. ఇంతకీ మన బంటీ ఎక్కడా అని బంటీని పట్టుకొని ముద్దాడుతుంది. రూప బిత్తరపోతుంది. బంటీ అసలైన రూపని పట్టుకొని తినే మా అమ్మానువ్వు కాదు అని రుక్మిణి వెనకాలే దాక్కుంటాడు. రుక్మిణి బంటీని దగ్గరకు తీసుకుంటుంది. కన్నవాళ్లు, కట్టుకున్న వాడే నమ్మనప్పుడు కడుపున పుట్టిన నా బిడ్డ ఎలా నమ్ముతాడు అని అడుగుతుంది. ఇక రుక్మిణి, రాజులను చూసి మీరేంటి శోభనానికి రెడీ అయినట్లున్నారు. అంటే ఏంటి ఇదెవరో నాలా  ఉందని దానికి రాజుకి పెళ్లి చేసేశారా నాన్నా. అచ్చం నాలా ఉందని నమ్మారు కనీసం నాకు సంవత్సరీకం అయిన వరకు అయినా నా స్థానం ఉంచలేకపోయారా.. అయినా నీ బుద్ధి ఏమైంది రాజు నేను కళ్ల ముందు ఉన్నవరకే నీ భార్యనా నేను లేకపోతే ఎవరినైనా పెళ్లి చేసుకుంటావా.. బంటీ కోసం అమ్మా అని చంద్ర అంటే బంటీ కోసం అయితే బంటీ కోసం మాత్రమే ఉండాలి ఇలా ఇంకొకరి కోసం బరితెగించకూడదు కదా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.