గుండెనిండా గుడిగంటలు జూలై 31 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 31st Episode)

పెద్దాయనకు సహాయం చేయాలని ఫిక్సైనబాలు..ఆ ఇంటికి వెళ్లి రౌడీలకు నాలుగు తగిలించి ఇల్లు ఖాళీ చేయిస్తాడు. నామాట మన్నించి సాయం చేశావు ఈ డబ్బు తీసుకో అని పెద్దాయన అంటాడు. నేను డబ్బుకోసం చేయలేదు.. కూతురి పెళ్లికోసం ఓ తండ్రి పడుతున్న తపన చూసి వచ్చాను అంటాడు. నా మాట ప్రకారం డబ్బుతీసుకో అంటే..కృతజ్ఞత ఉంటే పెళ్లికి పిలవండి అన్నయ్యగా వచ్చి అక్షింతలు వేస్తాను అంతే కానీ ఇలా డబ్బులు ఇవ్వొద్దు అంచాడు. కూతురి పెళ్లికి కొడుక్కి బట్టలు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తున్నా తీసుకోండి అంటాడు పెద్దాయన. మొహమాటపడుతూనే తీసుకుంటాడు బాలు. దూరం నుంచి ఇదంతా చూస్తారు ప్రభావతి కామాక్షి. ఏం జరిగిందని అక్కడున్నవాళ్లను అడిగితే.. ఇంట్లో రౌడీలను తరిమిసేందుకు ఓ కిరాయి రౌడీని తీసుకొచ్చాడు ఆ పెద్దాయన..అందుకే డబ్బులిస్తున్నాడని చెప్తారు. బాలు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని ఫైర్ అవుతుంది ప్రభానతి..కామాక్షి కూడా షాక్ అవుతుంది.

మీనాకోసం బండి కొని ఇంటికి తీసుకెళ్తాడు బాలు. ఇంట్లో అందర్నీ పిలిచి మొబైల్ పూలషాపు చూపిస్తాడు. నువ్వు పూలకొట్టు పెట్టుకుంటే కుళ్లుకుని ఎవరో కంప్లైంట్ ఇచ్చి పీకించేశారు కదా..ఇప్పుడు నీకోసం మొబైల్ పూలషాపు పెట్టించా దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటాడు. ఇదంతా చూసి రోహిణి కుళ్లుకుంటుంది. ప్రభావతి అమ్మ ఏది.. ఇప్పుడు ఉండిఉంటే తెగ కుళ్లుకునేది నేను చూసి ఆనందించేవాడిని అంటాడు బాలు.

బాలుకి గాయం అయిన సంగతి చూస్తుంది మీనా. రౌడీలతో గొడవ జరిగినప్పుడు కత్తిపోటు తగులుతుంది. గాయానికి మందు రాస్తుంది. ఏం జరిగిందని ఎవరు ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పడు బాలు. గుడిముందు అడుక్కుంటుంటే పాత బొచ్చె గీసుకుపోయిందని సెటైర్ వేస్తాడు. ఇంతలో ప్రభావతి వచ్చి ఏం జరిగిందో నేను చెప్తాను అంటుంది. కిరాయి రౌడీగా మారి డబ్బులు సంపాదించి ఆ బండి కొన్నాడు..కష్టపడి కొనలేదు అంటుంది ప్రభావతి. ఇలా రౌడీగా మారి సంపాదించేకన్నా పార్కులో పడుకోవడం మంచిదని సెటైర్ వేస్తుంది రోహిణి. ఇలాంటి వాడు నా కడుపున చెడపుట్టాడు వెంటనే ఇంట్లోంచి తరిమేయండి అంటుంది ప్రభావతి. సత్యం కూడా బాధపడతాడు..ఇలా చేస్తావని అనుకోలేదంటాడు. ఏంటండీ ఇదంతా అని మీనా అడిగితే..అమ్మ చెప్పింది నిజమే కానీ అందులో సగమే నిజం ఉందంటాడు. ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా ఇవ్వదు ప్రభావతి. ఇంట్లోంచి పంపించేయాలని పట్టుబడుతుంది.. ఇంతలో ఎంట్రీ ఇస్తాడు పెద్దాయన

పెద్దాయన మీరు ఇక్కడకు వచ్చారేంటని అడుగుతాడు బాలు. నీకోసం టాక్సీ స్టాండ్ కి వెళ్లాను అక్కడ లేవు..వాళ్ల చెప్పడంతో ఇంటికి వచ్చానంటాడు. ఎందుకు అని బాలు అడిగితే.. మొదటి శుభలేక దేవుడి దగ్గర పెట్టమన్నారు..నాకు దేవుడు నువ్వే అందుకే నీకు ఇద్దామని వచ్చానంటాడు. బాలుని కిరాయి రౌడీగా పెట్టుకుంది ఇతనే అంటుంది ప్రభావతి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు..ఇంత మంచి కొడుకును కన్న ఆ తల్లి ఎంత గొప్పది అని పొగుడుతూ..మీకు మీ కొడుకు ఏమీ చెప్పలేదా అని అడుగుతాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు.. బాలుని పొగుడుతుంటే రోహిణి, ప్రభావతి అవాక్కైచూస్తుంటారు. పెద్దాయన అసలు నిజం చెప్తాడు..