Karthika Masam Ending Poli Swargam 2024 Puja Vidhanam :


మార్గశిరమాసం మొదటి రోజు పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు ఇది. కార్తీకం నెలరోజులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి ఉపవాసాలు చేసినవారు..పోలి పాడ్యమి రోజు వెలిగించే దీపంతో నెల రోజుల నోముకి ఫలితం పొందుతారు. వేకువజామునే స్నానమాచరించి కార్తీకదామోదరుడిని స్మరించుకుని దీపం వెలిగిస్తారు. నెల రోజులు నదుల ఒడ్డున దీపం వెలిగిస్తే..పోల పాడ్యమి రోజు దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. అరదొప్పలపై దీపాలు వెలిగిస్తే నీటిలో తేలియాడుతాయి. నదులు, పుష్కరిణులు దగ్గరకు వెళ్లలేనివారు ఇంట్లో తులసి మొక్క దగ్గర బకెట్ లేదా టబ్ లో నీళ్లునింపి దీపాలు అందులో విడిచిపెడతారు. 


పంచభూతాత్మకం అయిన శరీరాన్ని పంచభూతాల్లో ఒకటైన పరమేశ్వరుడికి అంకింత చేయడమే దీపాలు నీటిలో వదలడం వెనుకున్న ఆంతర్యం. ఆత్మను జ్యోతి స్వరూపం అని చెబుతారు..అందుకే జ్యోతి రూపంలో ఆత్మను భగవంతుడికి దగ్గరకు పంపించడమే. అలా అయితే నిత్యం దీపాలు నీటిలో వదలొద్దు కదా..కార్తీకమాసంలోనే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. ఈ 12 నెలల్లో కార్తీకమాసం శివుడికి అత్యంత ప్రీతికరం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి దీపం వెలిగిస్తే..మరణానంతరం పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం. కార్తీకమాసంలో దీపాలు వెలిగించలేనివారు..పోలి పాడ్యమి రోజు 30 వత్తులు వెలిగిస్తే నెలంతా దీపం వెలిగించిన ఫలితం వస్తుందంటారు.  
 
పోలిపాడ్యమి రోజు తులసికోట దగ్గర కానీ, నదుల వద్ద కానీ దీపాలు వెలిగించిన తర్వాత... సంకల్పం చెప్పుకుని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, తులసి అష్టోత్తర శతనామావళి చదువుకుంటారు. పూజ పూర్తైన తర్వాత బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పోలి స్వర్గం కథ చదువుకుని అక్షతలు వేసుకుంటే..మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం. పోలి స్వర్గం కథ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.


Also Read: కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!


శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ( Sree Maha Lakshmi Ashtottara Sata Naamaavali )
 
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)


ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)


ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)


ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)


ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)


ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)


ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)


ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)


ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)


ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)


ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)


ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।


Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!