Kalpavriksha Vahana Seva : తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన జూన్ 05 గురువారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుంచి వాహనసేవ వైభవంగా సాగింది.
వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్పవృక్ష వాహనసేవ కోలాహలంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు
కామధేనువుతో పాటూ పాలసముద్రం నుంచి ఉద్భవించింది కల్పవృక్షం. ఈ చెట్టు మొదట్లో భూమిపై ఉండేదట. కానీ ప్రజలు చెడు కోర్కెలు కోరి దీన్‌ని దుర్వినియోగం చేయడంతో ఇంద్రుడు ఈ వృక్షాన్ని స్వర్గానికి తీసుకెళ్లాడని చెబుతారు. దేవలోకంలో ఐదు కల్పవృక్షాలు ఉన్నాయని పురాణాల్లో ఉంది. అవే మందారం, పారిజాతం, శంతన, కల్ప వృక్షం, హరిచందనం.
ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటలవరకూ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకూ ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించనున్నారు
జూన్ 05 సాయంత్రం సర్వభూపాల వాహనం
రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకూ రెండు గంటలపాటూ సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించనున్నారు. రాజా ప్రజారంజనాత్ అని చెప్పినట్టు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ విశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. పాలకులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే వారు కూడా భగవంతుడి సేవలో భాగం కావాలనే దివ్యమైన సందేశం ఇస్తారు స్వామివారు.
జూన్ 06 గరుడసేవ
వాహనసేవల్లో అత్యంత ప్రధానమైన గరుడవాహన సేవ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 06 ఏకాదశి శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ గరుడవాహన సేవ ఘనంగా జరగనుంది.
శ్రీ వేంకటేశ ప్రపత్తిః
ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్ క్షాంతి సంవర్థనీమ్‌పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియంవాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!