Healthy Lifestyle for Diabetics : మధుమేహం ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా అందరినీ ఎటాక్ చేస్తుంది. జన్యుపరంగా కొందరు డయాబెటిస్తో ఇబ్బంది పడుతుంటే.. లైఫ్స్టైల్లో మార్పుల కారణంగా ఎక్కువమంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే జీవితాంతం దానిని కంట్రోల్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని సహజంగా తగ్గించుకోవడానికి లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణలు. ఇవి మధుమేహాన్ని తగ్గించడమే కాకుండా.. రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి.
వ్యాయామం
మీకు మధుమేహం ఉన్నా.. రాకుండా ఉండాలన్నా రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ ఉండాలి. వ్యాయామం కుదరకుంటే వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి.
బరువు
మధుమేహముంటే.. లేదా మధుమేహం రాకుండా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు అదుపులో ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు మంచి డైట్, రెగ్యులర్ వ్యాయామం చేస్తూ ఉండాలి.
ప్రాసెస్ చేసిన పుడ్
షుగర్‌తో నిండి ఫుడ్స్, రిఫైండ్ ఫుడ్స్, అన్‌హెల్తీ ఫ్యాట్స్‌తో నిండి ఉండే ప్రాసెస్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అంతేకాకుండా వీటిని తినేకొద్ది తినాలనిపిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు పెంచడంతో పాటు గ్లూకోజ్ లెవెల్స్‌ని పెంచి మధుమేహాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఫైబర్ ఫుడ్స్
ప్రాసెస్ ఫుడ్స్‌కి డయాబెటిస్ పేషెంట్లు ఎంత దూరంగా ఉండాలో.. ఫైబర్ ఫుడ్‌కి అంత దగ్గరగా ఉండాలి. ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందించి.. షుగర్ స్పైక్స్‌ని కంట్రోల్ చేస్తుంది. పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు గట్ హెల్త్‌ని మెరుగుపరిచి.. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.
హైడ్రేషన్
తరచూగా శరీరానికి నీటిని అందించాలి. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ మెరుగై.. శరీరంలోని టాక్సిన్లను, పెరిగిన గ్లూకోజ్‌లను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండడంవల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావు. డీహైడ్రేషన్ మధుమేహాన్ని రెట్టింపు చేస్తుందని గుర్తించుకోవాలి.
ఒత్తిడి
ఒత్తిడి కూడా మధుమేహాన్ని పెంచుతుంది. డయాబెటిస్ రావడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
స్మోకింగ్
స్మోకింగ్ డయాబెటిస్ సమస్యలను రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండి హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. న్యూరో సమస్యలు కూడా రావొచ్చు. స్మోకింగ్ మానేస్తే రక్త ప్రసరణ పెరిగి.. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానేయండి.
నిద్ర
రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. సరైన నిద్ర లేకుంటే డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మంచి నిద్రవల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి మెరుగైన నిద్ర అవసరమని గుర్తించుకోండి.
ఆల్కహాల్..
మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇది లివర్ హెల్త్‌ని కరాబ్ చేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఇది పూర్తి ఆరోగ్యానికి మంచిది.
మెడిసన్
మధుమేహం ఉంటే వైద్యులు కచ్చితంగా కొన్ని మందులు సూచిస్తారు. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పరిస్థితి కంట్రోల్ ఉంటుంది. అలాగే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటే మంచిది.
ఇవే కాకుండా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మరచిపోకండి. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా.. కంట్రోల్లో ఉంటాయి. ఈ లైఫ్‌స్టైల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటే మధుమేహం తగ్గుతుంది. అంతేకాకుండా మధుమేహం రాకూడదనుకునేవారు కూడా వీటిని ఫాలో అయితే డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చు.