Astrology Predictions Trigrahi Yoga in Gemini: నెలకో రాశిలో పరివర్తనం చెందే సూర్య భగవానుడు జూన్ 15న మిథున రాశిలో అడుగుపెడతాడు. అదే సమయంలో దేవగురు బృహస్పతి, బుధుడు కూడా ఇదే రాశిలో ఉంటాయి. ఫలితంగా మూడు గ్రహాలు ఒకేసమయంలో ఒకే రాశిలో సంచరించడాన్ని త్రిగ్రాహి యోగం అంటారు.

Continues below advertisement


జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఆధారంగా ఆయా రాశులవారి ఫలితాలు అంచనా వేస్తారు. గ్రహాలు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఫలితాల్లో మార్పులుంటాయి. ఈ ఏడాది జూన్ లో మిథన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది.


సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు


గురు గ్రహం మే 09న మిథున రాశిలో ప్రవేశించాడు.. సెప్టెంబరు 29 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు
 
జూన్ 06 నుంచి బుధుడు మిథునంలోకి అడుగుపెడతాడు..
 
సూర్యుడు మిథునసంక్రమణం చెందేసరికి గురుగ్రహం, బుధుడు ఇదే రాశిలో ఉంటారు.  ఈ ఫలితంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. 


మేష రాశి


మిథునంలో త్రిగ్రాహి యోగం మీకు కలిసొస్తుంది. జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఇబ్బందులు సమసిపోతాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి


వృషభ రాశి
 
త్రిగ్రాహి యోగం వల్ల వృషభ రాశి జాతకులు ఆర్థిక లబ్ది పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు వింటారు. పనితీరుతో మంచి గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. 


మిథున రాశి


మీ రాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల మీకు శుభ ఫలితాలున్నాయి. కొన్నాళ్లుగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. ఇంట్లో శుభసంఘటలు జరుగుతాయి.వ్యాపారంలో లాభాలుంటాయి.  


కర్కాటక రాశి


త్రిగ్రాహి యోగం వల్ల మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి.  వాహనం కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  


కన్యా రాశి


మిథునలో త్రిగ్రాహి యోగం కన్యారాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కోర్టు కేసుల నుంచి ఉపశమనం  లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారు లాభాలు ఆర్జిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థికంగా అడుగులు ముందుకు పడతాయి. శుభవార్తలు వింటారు.


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.


తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!