Kaal Bhairav Astami 2022: సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు. శంకరుడి వాహనం శునకం (కుక్క)..అందుకే ఈ రోజు శునకాలను పూజించి వాడికి ఆహారం సమర్పిస్తారు. భైరవ అవతారం వెనుక ఓ కథనం ఉంది...ఒకానొక సందర్భంలో బ్రహ్మ , శ్రీ మహావిష్ణువు మధ్య వివాదం వచ్చింది. విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారనే చర్చ జరిగింది. అప్పుడు మహర్షులేమన్నారంటే...సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిదని చెప్పడంతో ఆ వాదన అంగీకరించిన రుషులు మౌనం వహించారు. కానీ బ్రహ్మ మాత్రం అంగీకరించలేదు. ఆ పరతత్వం నేనే అని అహం ప్రదర్శించాడు..అప్పుడు పరమశివుడు కాలభైవర స్వరూపం చూపించి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.
Also Read: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు
కాల భైరవుడు మనకి వివిధ క్షేత్రాలలో ఎనిమిది రకాలుగా కనిపిస్తారు
1. అసితాంగ భైరవుడు
2. సంహార భైరవుడు
3. రురు భైరవుడు
4. క్రోధ భైరవుడు
5. కపాల భైరవుడు
6. రుద్ర భైరవుడు
7. భీషణ భైరవుడు
8. ఉన్మత్త భైరవుడు
వీళ్లు కాకుండా... మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు సహా మరో ఇద్దరు భైరవులున్నారు.
స్వర్ణాకర్షణ భైరవుడు
చూడడానికి ఎర్రగా కనిపించే స్వర్ణాకర్షణ భైరవుడు బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. ఈ భైరవుడిని ఆరాధిస్తే సరి సంపదలు ఇస్తాడని విశ్వాసం.
ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు. కాలస్వరూపం తెలిసిన వాడు.కాలంలాగే ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు. అందుకే "ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్" అని ప్రార్థిస్తారు.
Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు
కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు: కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. కాశీలో అడుగుపెట్టాలంటే ముందుగా కాలభైరవుడి అనుమతి ఉండాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే హోమ కార్యాల్లో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. ఆయుష్షుని ప్రసాదించే ఈశ్వరుడికి పరమవిధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని, మృత్యు బాధలు తొలగిపోతాయని విశ్వాసం. కాశీ క్షేత్రంలో ‘కపాలమోచన దివ్యతీర్థం' ఉంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తీర్ధానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. ఇక్కడ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యం సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. s
మన దేశంతో పాటూ విదేశాల్లోనూ కాలభైరవ స్వామి దేవాలయాలు
- కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఊరులో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని రెండవ కాశీగా భావిస్తారు
- శ్రీ కాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడుగా కోలువు దీరాడు.భక్తులు తమ ఒంటిమీది బట్టలలో కోన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు ఇలా చెయడం వలన అరిష్టాలు తోలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు
- విశాఖపట్నంలో భైరవకోన ప్రముఖమైనది
- కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయములో క్షేత్రపాలకుడు కాలభైరవుడే
- న్యూఢిల్లిలో పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైనది
- తమిళనాడులో అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవులున్నారు
- కరైకుడి,చోళపురం,అధియమాన్ కొట్టయ్, కుంభకోణాల్లో భైరవస్వామి దేవాలయాలున్నాయి
- మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కాల భైరవాలయం ఉంది
- కర్ణాటక రాష్ట్రంలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలున్నాయి
- నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి