2022 జనవరి నెలవారీ రాశి ఫలితాలు
మేషం
ఈ నెలలో ఈ రాశివారికి మొదటి 15 రోజులు కన్నా మిగిలిన 15 రోజులు అద్భుతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, పాతమిత్రులను కలుసుకుంటారు. బంధువుల ఇళ్లకు రాకపోకలు సాగిస్తారు. అన్ని రంగాల వారికి శుభసమయం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
వృషభం
వృషభ రాశివారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు. గృహంలో మార్పులుంటాయి, వాహన ప్రమాదం సూచనలున్నాయి జాగ్రత్త. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. వృత్తి , వ్యాపారాల్లో కష్టపడాల్సి ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. విరోధాలకు దూరంగా ఉండండి.
మిథునం
మిథున రాశి వారు ఈనెలలో ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడతారు.కోపం పెరుగుతుంది, అందరితోనూ బిగ్గరగా మాట్లాడతారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. నూతన వస్తు,వస్త్ర ప్రాప్తి ఉంటుంది. వ్యాపారులకు కలిసొస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..
కర్కాటకం
ఈ నెలలో మీకు చికాకు కలిగించే సంఘటనలు జరగొచ్చు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు, కంగారు పడతారు. పాతమిత్రులను కలుస్తారు. ప్రయామాలు కలిసొస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భార్య-భర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
సింహం
ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంది. ఎవరి రంగంలో వారు సక్సెస్ అవుతారు. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆదాయం బావుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో ఎంజాయ్ చేస్తారు.
కన్య
ఈ నెలలో మీకు గ్రహసంచారం బావుంది. అనుకున్న పని అనుకున్నట్టు అవలీలగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం బావుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ధైర్యంగా దూసుకెళతారు. పాతమిత్రులను కలుసుకుంటారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
తుల
ఈ నెలలో ఏం చేసినా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది, సమయానికి డబ్బులు చేతికందుతాయి. ఆరోగ్యం బావుంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. సమస్యలు తీరతాయి, కోర్టు కేసులు అనుకూలిస్తాయి. వాహనం కొనుగోలు చేయొచ్చు.
వృశ్చికం
ఈ నెల రోజులూ వ్యాపారులకు కలిసొస్తుంది. ఆదాయం బావుంటుంది. వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆదాయం బావుంటుంది, ఆరోగ్యం బావుంటుంది. ప్రయాణాలు చేస్తారు. పాతమిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతోషంగా ఉంటారు.
ధనస్సు
ధనస్సు రాశివారికి జనవరి నెల అంతగా అనుకూల ఫలితాలు లేవు. చీటికి మాటికీ ఆందోళన చెందుతారు, ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చితాకు కల్గించే సంఘటనలు జరుగుతాయి. భార్య-భర్త మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది..మాటలు అదుపు చేయండి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
మకరం
ఈ నెలలో మకర రాశివారి గ్రహస్థితి అంతగా బాగాలేదు. కొత్త ప్రణాళికలు రూపొందించవద్దు, కొత్తగా ఏపనీ తలపెట్టవద్దు. ధైర్యంగా పూర్తిచేద్దామని ప్రయత్నించినా కొన్ని అడ్డంకులు అధిగమించలేక మధ్యలోనే వదిలేసే అవకాశం ఉంది. ఏం మాట్లాడినా విరోధమే అన్నట్టుంటుంది. కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు గడ్డు కాలం అని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో తగాదాలు జరిగే అకాశం ఉంది. పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
కుంభం
జనవరి నెల కుంభరాశివారికి కూడా ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారాలు, వ్యవహారాలు అంత అనుకూలంగా సాగవు. ఏ రంగం వారికైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. నమ్మిన వారివల్ల నష్టపోతారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.
మీనం
మీన రాశివారికి గడిచిన రెండు మూడు నెలలతో పోలిస్తే ఈ నెల బావుంటుంది. వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బావుంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. సంతోషంగా ఉంటారు.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి