Sri Katyayani Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తోంది.  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి మూడు రోజులు బాలా త్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చిన  దుర్గమ్మ..నాలుగో రోజు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. 

Continues below advertisement

శ్రీ కాత్యాయనీ అమ్మవారికి ఈ రోజు...

అమ్మవారికి ఈ రోజు పసుపు రంగు చీర సమర్పిస్తారు

Continues below advertisement

అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు

పాయసాన్నం నివేదిస్తారు సింహవాహనంపై కొలువై అభయం ఇచ్చే కాత్యాయనీ మాత అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేవారికి చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తుందని చెబుతారు.

శ్లోకం

‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనాకాత్యాయనీ శుభం దద్యాత్‌ దేవీ దానవ ఘాతినీ’

కాత్యాయనుడు అనే మహర్షి తపస్సు ఆచరించి.. స్వయంగా అమ్మవారే తన ఇంట పుత్రికగా జన్మించాలని వరం కోరుకున్నాడు. అలా ఆ మహర్షి ఇంట జన్మించింది అమ్మవారు. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి...కాత్యాయని అనే పేరు. అభయవర ముద్రలతో పాటు  ఖడ్గాన్నీ, పద్మాన్నీ ధరించి కనిపిస్తుంది కాత్యాయని. అజ్ఞానాన్ని దహించే చిహ్నం పద్మం , ఆపదలు ఎదుర్కొనేందుకు సూచన ఖడ్గం...అలా  అజ్ఞానాన్ని, ఆపదలను దూరం చేసే స్వరూపం కాత్యాయని. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి అయిన శ్రీ కాత్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కాంద పురాణంలో ఉంది. 

ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత అయిన శ్రీ కాత్యాయని దుర్గ..ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అందుకే కాత్యాయనీ అమ్మవారిని పూజిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. అవివాహుతులు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తమ జీవిత భాగస్వామి లభిస్తారు. కాత్యాయనీ ఆరాధన విశిష్టత శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణను పూజించి..పసుపురంగు చీర సమర్పించి..అరటిపండ్లు, పాయసాన్నం నివేదిస్తే జాతకంలో ఉండే  కుజ దోషం, బృగు దోషం తొలగిపోయి సకాలములో వివాహం జరుగుతుంది. ఈ రోజు కాత్యాయనీ వ్రతం ఆచరించిన తర్వాత విద్వత్తు ఉన్న పండితుడికి  ఉలవలు, విభూధి, ఎరుపు లేదా బూడిద వర్ణం దుస్తులు దానంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి గట్టెక్కే మార్గం కనిపిస్తుంది. వాహన గండాలు దాటుతాయి..వాహనయోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!

నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి