Srisailam : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహర్నవమి అయిన అక్టోబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించున్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, స్వామివారి ఉత్సవాలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. బారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ముఖ్యమైన ఉత్సవాల వివరాలు సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు ఘటస్థాపన, దుర్గా దేవి అలంకారం
సెప్టెంబర్ 23 నుంచి అమ్మవారి అలంకారాలు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 30 న మహాషష్ఠి సందర్భంగా భ్రమరాంబికా అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది
అక్టోబర్ 1 మహర్నవమి రోజు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది అక్టోబర్ 2 విజయదశమి రోజు బలి సమర్పణ, ఉత్సవాల ముగింపు
శ్రీశైలంలో నవదుర్గల అలంకారాలు ఇవే
ఒక్కో ఆలయంలో అమ్మవారి అలంకారాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పిన తొమ్మిదిమంది దుర్గలను నవదుర్గలు అని పిలుస్తారు. ఈ అలంకారాలు శ్రీశైలంలో దర్శించుకోవచ్చు
శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో దూకి తనని తాను ఆహుతి చేసుకున్న తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది. త్రిశూలం, కమలంతో చంద్రవక్ర కలిగి వృషభ వాహనంపై దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి
జపమాల, కమండలం ధరించి శివుడి కోసం ఘోరతపస్సు చేసిన రూపం ఇది. బ్రహ్మచారిణి దుర్గను పూజిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం చంద్రఘంట
తలపై అర్థచంద్రాకారం దర్శనమిస్తుంది చంద్రఘంటా దేవి. సింహవాహనంపై బంగారు కాంతితో మెరిసిపోతూ పదిచేతుల్లో ఖడ్గం, బాణం సహా వివిధ అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. చంద్రఘంటను దర్శించుకునే మానసిక ప్రశాంతత లభిస్తుంది కూష్మాండ
కూష్మాండ దుర్గ 8 చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద , జపమాల ఉంటాయి. ఈ దుర్గ దర్శనం అనారోగ్యాన్ని తొలగిస్తుంది
స్కందమాత
చిన్నారి స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చేతిలో పద్మం ధరించి దర్శనమిస్తుంది స్కందమాత. అభయముద్ర, కమలం ధరించి ఉండే స్కందమాతను పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం
కాత్యాయని
నాలుగు భుజాలతో వెలిగే కాత్యాయనీ మాత చేతుల్లో అభయ ముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మంతో సింహవాహనంపై కొలువై ఉంటుంది. ఈ అమ్మ దర్శం చతుర్విధ పరుషార్థాల ఫలం సిద్ధింపచేస్తుంది
కాళరాత్రి
భయంకరంగా రూపంలో దర్శనమిచ్చే కాళరాత్రి అమ్మవారి వాహనం గాడిద. వరముద్ర, అభయముద్ర, ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గంతో చూసేందుకు భయంకరంగా ఉండే ఈ రూపం..సకల శుభాలు ప్రసాదిస్తుంది. శత్రుభయాన్ని పోగొడుతుంది మహాగౌరి
మహాశివుడి కోసం తపస్సు చేసి శరీరం రంగు కోల్పోయిన అమ్మవారిని అభిషేకం చేయగా శ్వేతవర్ణంలో మెరిసిపోయింది. ఈ రూపాన్ని మహాగౌరి అంటారు.గడిచిన జన్మలో పాపాలు నశింపచేస్తుంది మహాగౌరి సిద్ధిధాత్రి
సర్వవిధ సిద్ధులు ప్రసాదించే సిద్ధిధాత్రి నుంచే శివుడు కూడా సిద్ధులు పొందాడని దేవీపురాణంలో ఉంది. ఈ రూపాన్ని దర్శించుకుంటే సకల సిద్ధులు కలుగుతాయని నమ్మకం
నవదుర్గల శ్లోకంప్రథమం శైల పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకంపంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తానవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా