Bigg Boss 9 Telugu - Day 5 Episode 6 Review: కెప్టెన్సీ టాస్కులో శ్రీజకు లక్ కలిసి వచ్చింది. ఓనర్స్ గ్యాంగ్ నుంచి ఎవ్వరూ కూడా శ్రీజను ఆటలో డిస్టర్బ్ చేయలేదు. కానీ రాము, ప్రియల్ని మాత్రం అందరూ కదిలించారు. కడ్డీలు తీసినా కొద్ది, ఆట కష్టం అయినా కొద్ది పట్టుదలతో ఆడారు. కానీ శ్రీజ మాత్రం ఈజీగా గెలిచేసినట్టు అనిపించింది. ఇక కళ్యాణ్ పడాల కూడా బాగానే ఆడినా.. చేత్తో సపోర్ట్ తీసుకోవడంతో ఆటలోంచి వెళ్లిపోయాడు. చివరకు శ్రీజ నిలబడటంతో సంజనా కెప్టెన్‌గా మారింది. ఇక ఫస్ట్ కెప్టెన్ అయిన సంజనా ఇకపై టెంపరరీ ఓనర్ అని బిగ్ బాస్ తెలిపాడు.

Continues below advertisement

శ్రీజ పెద్దగా కష్టపడి కూడా ఆట ఆడలేదు. కానీ గెలిచిన తరువాత ‘నేను కెప్టెన్ కాకపోయినా.. సంజనాని కెప్టెన్ చేశా’.. అని ఎక్స్ ట్రా డైలాగ్స్ కొట్టేసింది. మనీష్ సంచాలక్‌‌గా కళ్యాణ్ పడాల చేత్తో సపోర్ట్ తీసుకున్నది చూడలేదని, అందరూ అరవడంతో ఒప్పుకున్నాడు అని ఇమ్ము కనిపెట్టేశాడు. ఇక కెప్టెన్ రూంలోకి తన లగేజీని మార్చుకునేందుకు ఫ్లోరా పని చేయాలని సంజనా ఆదేశించింది. కానీ ఆ పనులు తాను చేయను అని, లగేజీ మోయను అని ధిక్కరించింది. ఇంతలో కెప్టెన్ ఫుడ్‌ని, డ్రింక్‌ను ప్రియ దొంగతనం చేసింది.

Also Readబిగ్‌ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?

Continues below advertisement

తనూజ డబుల్ ఫేస్ అని మనీష్, శ్రీజ, పవన్ ఆమె మీద గాసిప్స్ చేసుకుంటూ ఏడ్చేస్తున్నారు. సంజనాది మంచి మనసు.. కాకపోతే అటెన్షన్ కోరుకుంటోంది.. ఏ దారిలో వెళ్తూ ఉంటే.. కప్పు ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తోంది అని భరణితో ఇమ్ము మాట్లాడాడు. కెప్టెన్సీ టాస్కులో జరిగిన గొడవతో హరీష్ కాస్త సీరియస్‌గా ఉంటున్నాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పినా కూడా భరణికి తిరిగి గుడ్ మార్నింగ్ అని హరీష్ చెప్పలేదు. దీంతో భరణి కాస్త హర్ట్ అయ్యాడు. కనీసం తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పకపోతే ఎలా అని అనుకున్నాడు.

ఇక కెప్టెన్ అయిన తరువాత సంజనా.. తనకు ఇష్టమైన ఫుడ్ కావాలంటూ ఆర్డర్లు ఇచ్చింది. ఎలా చేయాలి.. ఏది ఎంతెంత వేయాలో కూడా ఆర్డర్ ఇచ్చేస్తోంది. అల్లం చట్నీ కావాలంటే.. దోశలు, ఇడ్లీలు కావాలంట అని ఇమ్ము, భరణిలతో తనూజ చెప్పింది. ఉన్న రేషన్‌లో అవన్నీ చేయడం కష్టం అంటూ తనూజ తెలిపింది. ఈ క్రమంలోనే ఆనియన్ చట్నీ విషయంలోనూ పవన్, తనూజ మధ్య మళ్లీ చిన్న వాగ్వాదం జరిగింది. ఇక ఈ సందులో సడేమియా అన్నట్టుగా సంజనా కిచెన్ టేబుల్ వద్ద పెట్టిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను దొంగతనం చేశాడు. ఆ తరువాత ఆ కూల్ డ్రింక్‌ను ఫ్లోరా సాయంతో బాటిల్‌‌లో నింపాడు హరీష్. ప్రియ, హరీష్, ఫ్లోరా ఆ డ్రింక్‌ను షేర్ చేసుకున్నారు. ఇక ఇంట్లో హరీష్ తన ఫుడ్‌ను తానే ప్రిపేర్ చేసుకుని వండుకోవడంపై సంజనాను బిగ్ బాస్ మందలించాడు. దీంతో హరీష్ ఆ ఫుడ్‌ను పక్కన పెట్టేశాడు.

Also Read: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

స్కిట్ చేసి ఇంప్రెస్ చేస్తే కూల్ డ్రింక్ ఇస్తానని సంజనా చెప్పింది. దీంతో బర్రెల బండి అంటూ ఏదో పిచ్చి టాస్క్ వేశారు. దాన్ని చూస్తే ఎవ్వరికీ కూడా నవ్వు రాదు. ఇక అందులో బాగా యాక్ట్ చేసిన భరణి, సుమన్ శెట్టి, తనూజ, శ్రీజ ఇలా అందరికీ కూల్ డ్రింక్ ఇస్తానని సంజనా తెలిపింది. కానీ దొంగిలించిన కూల్ డ్రింక్ ఇస్తేనే ఇవన్నీ ఇస్తాను అని సంజనా మెలిక పెట్టింది. దీంతో అందరూ రివర్స్ అయ్యారు. మీరు దొంగతనాలు చేస్తే తప్పు లేదా? మీరు నేర్పిన విద్యనే ఎవరో మీ మీద ప్రయోగిస్తున్నారు అన్నట్టుగా హరీష్ కౌంటర్లు వేశాడు. అలా శుక్రవారం నాటి ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎవరికి ఎలా క్లాస్ పీకుతాడో చూడాలి.

Also Readబిగ్ బాస్ 9లో మూడో రోజు... వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ... గుడ్డుతో గొడవలు, తగువు పెట్టి తమాషా చూసిన సంజన