జూన్ 22 బుధవారం రాశిఫలాలు (Horoscope Today 22-06-2022) 


మేషం
పదో స్థానంలో ఉన్న చంద్రుడు మనశ్సాంతిని ఇస్తాడు. ఈ రోజు మీకు ఆద్యాత్మిక వైపు మనసు మళ్లుతుంది. ఉద్యోగులుకు మంచి రోజు. వ్యాపారం బాగా సాగుతుంది.విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. పసుపు, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు. 


వృషభం
కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. తలపెట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు. మీ మాటతీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభదినం. నీలం,ఆకుపచ్చ మీకు శుభప్రదమైన రంగులు.


మిథునం
ఈ రాశికి చెందిన బుధుడు, అష్టమ చంద్రుడు, సూర్యుడు భారీ ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాడు. తొమ్మిదో ఇంట శని కారణంగా ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగం మారాలి అనుకుంటే తొందరపడొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. పసుపు, ఆరెంజ్ మీకు మంచి రంగులు.


కర్కాటకం
రాజకీయ నాయకులకు ఈరోజు విజయవంతమైన రోజు అవుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. తెలుపు, నారింజ రంగులు మంచివి. 


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


సింహం
సూర్యుడి పదకొండో ఇంట సంచారం వల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.  మేనేజ్ మెంట్, ఐటీ రంగ విద్యార్థులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు శుభప్రదం.


కన్య
సూర్య,చంద్రులు శుభగృహంలో ఉన్నందున ఉద్యోగంలో పురోగతి పొందుతారు. రాహు కేతువుల సంచారం మీపై ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆంజనేయుడిని ఆరాధించండి. ఆరెంజ్, తెలుపు శుభప్రదమైన రంగులు.


తులా
వ్యాపారంలో పురోగతి ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరు మీకు సంతృప్తిని ఇస్తుంది. ఆరోగ్యం ఆనందం కోసం సుందరకాండ పఠించండి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. సప్తశ్లోకి దుర్గా పారాయణం వల్ల మేలు జరుగుతుంది.


వృశ్చికం
సూర్యుడు ఎనిమిదో స్థానంలో, చంద్రుడు తృతీయ స్థానంలో, శని నాలుగో స్థానంలో ఉన్నందున వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆకుపచ్చ, ఆకాశం రంగులు శుభప్రదం.స్థిరాస్తులు కొనుగోలు చేసే సూచనలున్నాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.


ధనుస్సు
ఈ రాశి నుంచి బృహస్పతి నాల్గవ ఇంట, చంద్రుడు రెండో స్థానంలో, సూర్యుడు ఏడో స్థానంలో ఉన్నారు. ఫలితంగా చాలా కాలంగా వ్యాపారంలో కూరుకుపోయిన డబ్బును తిరిగి పొందుతారు. విద్యార్థుల్లో సంఘర్షణ ఉంటుంది. ఉద్యోగులు తమ పనిపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎరుపు, నీలం మీకు మంచి రంగులు.


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి


మకరం
బృహస్పతి, చంద్రుడు, సూర్యుడి సంచారం శుభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీశ్సులు మీపై ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకుంటారు. రాజకీయ నాయకులు విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆకుపచ్చ, ఊదా రంగులు మీకు మంచివి.


కుంభం
ఈ రాశివారు ఆరోగ్యం, ఆనందం కోసం సుందరాడం పఠించండి. ఉద్యోగులు సక్సెస్ అవుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగొచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శుభసమయం. వైలెట్, ఆకుపచ్చ మీకు కలిసొచ్చే రంగులు. 


మీనం  
ఈ రాశివారు ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తాన్ని పొందుతారు. ఉద్యోగులకు పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంపై పూర్తిస్థాయి దృష్టిసారిస్తే మంచి ఫలితాలు పొందుతారు.విద్యార్థులు చదువుపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. రోజంతా సంతోషంగా ఉంటారు . ఎరుపు, నారింజ రంగులు శుభప్రదం.కనకధార స్తోత్రాన్ని పఠించండి


Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు