Horoscope Today 23 May 2022: ఈ రాశివారు గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మే 23 సోమవారం రాశిఫలాలు ( తులా రాశి నుంచి మీనరాశి వరకు)

తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి సాధారణంగా ఉంటుంది. దూర ప్రాంతం ప్రయాణం చేయాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కార్యాలయంలో పై అధికారులతో సమావేశం అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు తగ్గడంతో ఆ దిశగా ఆలోచన పెరుగుతుంది. పనికిరాని పనులకోసం సమయాన్ని వృధా చేయకండి. ఎప్పటి నుంచో రాకుండా పోయిన డబ్బు అనుకోకుండా చేతికందుతుంది. ఈ రోజు ఈ రాశివారు గంగాజలంలో శివుడిని అభిషేకిస్తే కష్టాలు తొలగిపోతాయి. 

Continues below advertisement

వృశ్చిక రాశి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆలోచనలపై తాత్విక ప్రభావం ఉంటుంది. తొందరపడి వ్యాపార ఒప్పందాలు చేసుకోకండి.  నిరుద్యోగులు కెరీక్ అవకాశాలు పొందుతారు. ఈ రోజు మీరు స్నేహితులను కలుస్తారు. 

ధనుస్సు రాశి
ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా  ఉంటాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.  మీరు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామిని సంతోష పెట్టేందుకు బహుమతులు కొనే ఆలోచన చేస్తారు. ఈ రోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అనవసర వాటికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు. 

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

మకర రాశి
ఈ రోజు మకరరాశివారికి  ఉదయం నుంచి కొంత టెన్షన్‌ ఉంటుంది. ప్రయాణించే వాహనం ట్రబుల్ ఇవ్వడంతో ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది.  లావాదేవీలు జరిపేటప్పుడు గందరగోళానికి గురవకుండా జాగ్రత్త పడండి.  దినచర్యలో మార్పు ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. జీవిత భాగస్వామి విషయంలో కొంత  టెన్షన్ ఉంటుంది. 
 
కుంభ రాశి 
ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మీ పట్ల అంకితభావంతో ఉంటారు. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. జ్ఞానం ఉన్న వ్యక్తిని కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది.  కొత్తగా తలపెట్టిన పనులు కలిసొస్తాయి. 

మీన రాశి
మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకుంటుంది.  మీరు కుటుంబ పనుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.  ప్రణాళికల ప్రకారం పనిచేస్తేనే పూర్తవుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొత్తవారితో స్నేహం ఏర్పడుతుంది. శత్రువులను నిర్లక్ష్యం చేయకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 

Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

Continues below advertisement