మేషం
మేషరాశివారికి ఈ రోజు అన్నీ ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ రోజు భారంగా గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి.  కుటుంబంలో కలహాల వాతావరణం ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. బంధువులను కలుస్తారు.
వృషభం
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో శుభవార్తలు వింటారు. పసుపు వస్తువులను దానం చేయండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 
మిథునం 
ఉద్యోగస్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. భాగస్వామ్యులతో వివాదాలు ఉండొచ్చు.  ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత మిత్రులను కలుస్తారు. జాగ్రత్తగా ఖర్చు చేయండి. బాధ్యతను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
Also Read:  ధన త్రయోదశికి బంగారానికి లింకేంటి, ఈ రోజు లక్ష్మీ పూజ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి?
కర్కాటకం
వ్యాపారంలో సమస్యలు ఉండొచ్చు. అసహనం ప్రదర్శించవద్దు.  గుర్తుతెలియని వ్యక్తుల వల్ల నష్టం జరగొచ్చు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.  ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి. ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి.
సింహం
ఈరోజు మీ పని సులభంగా పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గందరగోళంగా ఉంటారు.  ఒత్తిడి తీసుకోవద్దు.   వ్యసనాలకు దూరంగా ఉండండి.  జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 
కన్య
మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. మీ పనిపై శ్రద్ధ వహించండి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి. వినాయకుడిని పూజించడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. 
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
తుల
కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతుంది.  ఒత్తిడికి దూరంగా ఉండండి. పెద్ద సమస్యలు పరిష్కారమవుతాయి. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. భగవంతుని ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చికం
మీ జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించండి. పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు.  వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఆనందం ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి. 
ధనుస్సు
కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దూరప్రయాణం వాయిదా వేయండి. కార్యాలయంలో శుభవార్తలు వింటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. 
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
మకరం
ఎవరి మీదా కోపం పెంచుకోవద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కష్టాలు తొలగిపోతాయి. ఆనందం, సంపద పెరుగుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త వింటారు. దంపతులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులు లాభపడతారు. ఉద్యోగంలో మార్పులుండొచ్చు. కొత్త పెట్టుబడులు  పెట్టొద్దు.
కుంభం
ఇంట్లో అసమ్మతి సంకేతాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఎక్కువ ఖర్చు చేయవద్దు. పాజిటివ్ గా ఆలోచించండి.  బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. 
మీనం
మీకు గతంలో కన్నా  ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకుని ముందడుగేయండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర మాటలు కట్టిపెట్టండి.  టెన్షన్ తగ్గుతుంది. సమాజంతో గౌరవం పెరుగుతుంది. 
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read:కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి