మేషం
ఈ రోజు మీరు తలపెట్టిన పనిలో కొంత ఇబ్బంది ఉంటుంది. తెలియని అడ్డంకులు ఎదురవుతాయి. ఏ పనీ చేయాలని అనిపించదు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వారితో ఎక్కువ చనువు వద్దు. కార్యాలయంలో శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు. వ్యాపారులకు కలిసొచ్చే రోజిది.
వృషభం
లావాదేవీల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవరివల్లనైనా మీకు హాని ఉండొచ్చు. ఊహించని ఖర్చులుంటాయి. ఏ వ్యక్తి మాటల్లోనూ జోక్యం చేసుకోకండి. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఈ రోజు చేయవద్దు. ఆందోళన- ఒత్తిడి అలాగే ఉంటాయి.
మిథనం
ఈ రోజు పాత స్నేహితుడిని కలుస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగులు సహకారం ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటుతో నష్టపోయే అవకాశం ఉంది. ఒత్తిడి దూరమవుతుంది.
కర్కాటకం
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆచి తూచి మాట్లాడండి. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి.
సింహం
ఈరోజు మంచి-చెడు రెండు వార్తలు వింటారు. పెట్టిన పెట్టుబడి లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. సామాజిక సేవ చేసే అవకాశం మీకు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. బంధువులతో విభేదాలు రావొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
కన్య
ఒక పెద్ద బాధ్యత పూర్తైనందుకు సంతోషంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. విద్యార్థులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూల సమయం.
తుల
కొత్తగా చేపట్టిన పని ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సమస్యలు దూరమవుతాయి. ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి బయటపడవచ్చు. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆదాయం కొనసాగుతుంది. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. అలసటగా అనిపిస్తుంది. సహోద్యోగులు సహకరించరు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
వృశ్చికం
దినచర్యలో మార్పు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. స్టాక్ మార్కెట్ అనుకూల లాభాలను ఇస్తుంది. ఈ రోజు స్నేహితులతో పార్టీకి ఎంజాయ్ చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. సోమరితనం వద్దు.
ధనుస్సు
శుభవార్త వింటారు. పిల్లల వైపు విజయంతో సంతోషం ఉంటుంది. బంధువులను కలుస్తారు. రిస్క్ తీసుకోవచ్చు. వ్యాపారం బాగా జరుగుతుంది. సహోద్యోగులు ఉద్యోగంలో సహాయం చేస్తారు. తొందరపాటు-అజాగ్రత్త వల్ల నష్టపోతారు. దుర్వినియోగానికి దూరంగా ఉండండి.
మకరం
ఈరోజు గందరగోళం ఉంటుంది. దుర్వార్తలు వింటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తొందరగా అలసిపోతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మాట్లాడే సమయంలో దూషించే పదాలు ఉపయోగించవద్దు.
కుంభం
మతపరమైన కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఇతరులతో గొడవలు పడకండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ప్రయోజనం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
మీనం
ఆర్థిక పురోగతి కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. బంధువులతో ఉన్న వివాదం సర్దుమణుగుతుంది. ఆహారం తీసుకోవడంపై అశ్రద్ధ వద్దు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది.
Also Read: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..
Also Read: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!
Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!
Also Read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి