2022 మే 15 ఆదివారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు మీరు కుటుంబ అవసరాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు.  వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.  మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.


వృషభం
కొత్త ఉద్యోగం ప్రారంభించేందుకు తొందరపడకండి. రుణానికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో అధికారులను కలుస్తారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శించవచ్చు. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. సంబంధాలు బలపడతాయి.


మిథునం
పిల్లల పొరపాటు వల్ల మీకు కోపం వస్తుంది. టెన్షన్ పెరుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.  కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీకు పని చేయాలని అనిపించదు. విద్యార్థులు చదువు పరంగా  ఇబ్బంది పడతారు. ఇంటికి అతిథుల రాక ఉంటుంది. 


కర్కాటకం
ఉద్యోగం మారే ఆలోచన పెట్టుకోకండి. మీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అజాగ్రత్త వల్ల పని పాడవుతుంది.  మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. ఈగో తగ్గించుకోండి.  ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.


సింహం
వ్యాపారంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ  నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.  మీరు కార్యాలయంలో కొత్తగా ట్రై చేయాలనుకుంటారు.  విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీకు పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతారు. తండ్రి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. చ్చు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.


కన్యా
ఆరోగ్యం క్షీణించవచ్చు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రజలు మీ పని తీరును అభినందిస్తారు. రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండండి. ఎలాంటి వివాదంలో భాగం కావద్దు.


తులా
కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. పాత అనుభవాల పాఠాలు ఈరోజు ఉపయోగపడతాయి.  పనిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. యువతకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందుతారు. మీ జీవిత భాగస్వామి భావోద్వేగ మద్దతుతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. శారీరకంగా కొన్ని ఇబ్బందులుంటాయి. 


వృశ్చికం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు తొందరపడకూడదు. మీ డబ్బును దుర్వినియోగం చేయకండి. మీ మనసులో వింత ఆలోచనలు వస్తాయి.  ప్రయాణం చాలా ఒత్తిడితో కూడి ఉంటుంది.  ప్రతికూలతకు దూరంగా ఉండండి. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత చర్చలు చేయవద్దు.


ధనుస్సు
ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తా. ఒక స్నేహితుడు మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు.  మీ ప్రతిభ వెలుగుతుంది.  రాజకీయ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. 


మకరం
గుర్తు తెలియని వ్యక్తుల వల్ల నష్టపోతారు.  ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులను రక్షించండి. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీకు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. మీరు కొత్త ఉద్యోగం పొందుతారు.  మీ ఆలోచన చాలా సానుకూలంగా ఉంటుంది. 


కుంభం
మీరు అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి.  మీరు వ్యాపారంలో కొత్తగా ఏం ట్రై చేయవద్దు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది.


మీనం
ఎవరినీ దుర్భాషలాడవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.  మీ తప్పును మరొకరిపై బలవంతంగా రుద్దకండి. ఆహార నాణ్యతపై శ్రద్ధ వహించండి. కొన్ని రహస్య విషయాలు బయటికి రావచ్చు. మీరు కడుపు నొప్పితో బాధపడతారు. విద్యార్థులకు మంచి రోజు. 


Also Read: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో