వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మే 19వ తేదీన లాంచ్ కానుంది. కంపెనీ తీసుకురానుంది ఈ ఫోన్‌నే అని అధికారికంగా తెలపలేదు. అయితే మనదేశంలో కొత్త నార్డ్ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని మాత్రం ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఇటీవలే యూరోప్‌లో లాంచ్ అయింది. కాబట్టి ఇదే మనదేశంలో కూడా రానుందని అనుకోవచ్చు.


యూట్యూబ్ చానెల్ ద్వారా వన్‌ప్లస్ ఈ ఫోన్ లాంచ్‌ను ప్రకటించింది. మే 19వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేయనుందని కంపెనీ అధికారికంగా వీడియో ద్వారా ప్రకటించింది. అయితే ఆ వీడియోను ఇప్పుడు డిలీట్ చేసింది.


వన్‌ప్లస్ నార్డ్ 2టీ యూరోప్‌లో ఈ నెలలోనే లాంచ్ అయింది. దీని ధరను యూరోప్‌లో 399 యూరోలుగా (సుమారు రూ.32,100) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర మనదేశంలో ఇంకా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్పెసిఫికేషన్లు
వన్ ప్లస్ నార్డ్ 2టీ యూరోపియన్ వేరియంట్ ఫీచర్లే ఇండియన్ మోడల్లో కూడా ఉండే అవకాశం ఉంది. యూరోపియన్ మోడల్లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దాని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.


వన్‌ప్లస్ నార్డ్ 2టీ వెనకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్ వూక్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ నార్డ్ 2టీ సపోర్ట్ చేయనుంది. 50W ఎయిర్‌వూక్ ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేయనుంది. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా అందుబాటులో ఉంది.