2022 ఏప్రిల్ 16 శనివారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. సానుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు.స్వయం అధ్యయనంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.  పాత పాలసీ నుంచి ఆదాయం పొందుతారు.  ఉద్యోగులు శుభవార్త వింటారు. మాట్లాడేటప్పుడు అసభ్యకర పదాలు వినియోగించవద్దు. 


వృషభం
స్నేహితులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.  అనారోగ్య సమస్యలుంటాయి.  పిల్లల సమస్యలు పరిష్కరిస్తారు. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల టెన్షన్ పెరుగుతుంది.విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మాట వినండి. కోపంతో ఎవరితోనూ మాట్లాడొద్దు.


మిథునం
చాలా రోజులుగా చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది.  సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి. విద్యార్థుల దృష్టి చదువుపై ఉంటుంది. సీజనల్ వ్యాధుల బారిన పడొచ్చు. అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీపై పని ఒత్తిడి ఉంటుంది. బంధువును కలుస్తారు.


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే


కర్కాటకం
యోగా-ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు రహస్య శాస్త్రాలను అధ్యయనం చేస్తారు. పని ఒత్తిడి పెరిగి తొందరగా అలసిపోతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి.  వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉండొచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు విజయం సాధిస్తారు.


సింహం
అసభ్యంగా ప్రవర్తించకండి, వివాదాల్లో తలదూర్చొద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. పెద్ద ప్రాజెక్టులు చేతికొచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితులను కలుస్తారు.


కన్య
జీవిత తత్వశాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల కారణంగా  మీరు కొన్ని ఇబ్బందుల్లో పడతారు.  అనవసర వివాదాలుంటాయి. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభమవుతాయి. కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.


Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు


తులా
ప్రత్యర్థులు మిమ్మల్ని అభినందిస్తారు.  వ్యాపారంలో ఎదురైన సమస్యలను నైపుణ్యంతో పరిష్కరిస్తారు. మిమ్మల్ని మళ్లీ మళ్లీ బాధపెట్టే పనులు చేయకండి. విద్యుత్ పరికరాలతో కొన్ని ఇబ్బందులుంటాయి. కొత్త ప్రాజెక్టు టేకప్ చేస్తారు. రిస్క్ తీసుకోవద్దు.


వృశ్చికం
ఈ రోజు గొప్పగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.   పిల్లల కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. ఆస్తి కొనుగోలులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. 


ధనుస్సు 
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో  కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.  ఉద్యోగ సమస్యలు తీరుతాయి. వ్యాపార పర్యటనలు చేస్తారు. మీ పనిని పెంచుకోవడానికి ప్రణాళిక వేసుకుంటారు. కుటుంబ పెద్దల మాట వినండి. విహారయాత్రకు వెళ్తారు ఎవరి సహాయంతో మీ పని సులువవుతుందో ఆలోచించుకోండి.


మకరం
శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతారు. ఆందోళన చెందుతారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. స్నేహితులతో వివాదాలు ఈరోజు పరిష్కారమవుతాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. తెలివిగా ఖర్చు పెట్టండి. ప్రదర్శించాలనుకునే మీ ధోరణి నియంత్రించండి. ఎవరితోనూ గొడవపడకండి. 


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


కుంభం
అదృష్టం మీకు ముఖం చాటేస్తుంది.  కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ముందుగా చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రజల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. బంధువులను కలుస్తారు.


మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.  ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సంఘర్షణ పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లలతో సంతోషంగా గడుపుతారు.