2022 ఏప్రిల్ 1 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కష్టపడినా పరిస్థితులు అంత అనకూలంగా ఉండవు. ఉదయం కన్నా సాయంత్రం సమయానికి కొంత ప్రశాంతంగా ఉంటారు. అవసరం లేకుండా ప్రయాణం చేయొద్దు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుంది.
వృషభం
మీ నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తే పురోగతి చెందుతారు. కొత్త అవకాశాలను, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కార్యాలయ సిబ్బంది మద్దతు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. దూరప్రాంతం ప్రయాణం చేస్తారు.వ్యాపారులు, విద్యార్థులుకు శుభసమయం.
మిథునం
ఈ రోజు మీకు మంచి రోజు. మీ జీవిత భాగస్వామితో కొన్నివిషయాలపై చర్చిస్తారు. ఉద్యోగస్తులకు టైం కలిసొస్తుంది.గౌరవాన్ని అందుకుంటారు. మీరు ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మిత్రులను కలుస్తారు.
Also Read: 2022-2023 లో చిన్న చిన్న ఆటంకాలు మినహా ఏడాదంతా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
కర్కాటకం
మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. ఈ తెలివితేటలతో ఇతరులు ప్రయోజనం పొందుతారు. ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకండి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారకి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.
సింహం
ఈ రాశివారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్త. స్త్రీలు బిజీబిజీగా ఉంటారు. వ్యాపారులు రిస్క్ తీసుకోకుండా ఉంటే లాభాలొస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్యా
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ప్రేమికుల సంబంధానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.సంక్లిష్టమైన విషయాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఖర్చులు పెరగుతాయి. స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
తులా
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. నిర్వహణ సంబంధిత పనులను చాలా బాగా చేస్తారు. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వివాదం రావొచ్చు. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొత్త ఆస్తుల కొనుగోలు ద్వారా లాభం ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
వృశ్చికం
ఉద్యోగులు పనితో ఎంజాయ్ చేస్తారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. మీ జీవిత భాగస్వామి గురించి మీరు కొంచెం భావోద్వేగానికి లోనవుతారు.ఈరోజు మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు.సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళారంగంలోని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు
కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచనాత్మకంగా వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. పాత విషయాల వల్ల మీరు బాధపడొచ్చు. మీరు మీ విధానాన్ని మార్చుకోవాలి. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలతో గడుపుతారు.
మకరం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి లభిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఆన్‌లైన్ వ్యాపారంలో లాభాలను పొందుతారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.
కుంభం
కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. మీ బడ్జెట్ గురించి చాలా ఆందోళన చెందుతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. రిస్క్ తీసుకోకండి.
మీనం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగం వ్యాపారం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త బట్టలు, ఆభరణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు మంచి సమాచారాన్ని పొందుతారు. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.
Also Read:2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి