2022 ఫిబ్రవరి 25 శుక్రవారం రాశిఫలాలు


మేషం
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులకు మంచి రోజు., మీరు కొన్ని ధార్మిక పనుల్లో నిమగ్నమై ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


వృషభం
మీరు కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. రోజంతా పని చేస్తూనే ఉంటారు. బంధువలతో కలసి వ్యాపారం చేసేవారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఓ పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. జీవితంలో అతిముఖ్యమైన సమస్యల గురించి భాగస్వామితో చర్చిస్తారు. 


మిథునం
ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలన్నా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి...ధైర్యంగా అడుగేస్తే అనుకున్న పనులు పూర్తిచేస్తారు.  మిమ్మల్ని మీరు మానసికంగా దృఢంగా ఉంచుకోవడానికి యోగా,  ధ్యానం సాధన చేయండి. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా  మీరు కలవరపడవచ్చు. మీ ప్రియమైన వ్యక్తి గురించి ఎవరి మాట వినవద్దు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఇతరులను మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకనీయొద్దు. 


కర్కాటకం
ఈ రోజు మీరు ఒక సాధువు నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు.  గతంలో చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు అవసరమైన పత్రాలు మీ వద్ద ఉంచుకోండి. వైవాహిక జీవితంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలను జీవిత భాగస్వామితో చర్చించి పరిష్కరించుకోండి. 


Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది


సింహం
ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అయితే ప్రతిసారీ మీ జీవిత భాగస్వామిని నిందించకండి. కార్యాలయంలో ఈరోజు మీరు పడే శ్రమ సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ తక్షణ శ్రద్ధ అవసరమయ్యే అనేక సమస్యలు ఈరోజు తలెత్తవచ్చు. 


కన్య
 కోపం తగ్గించుకోండి. పిల్లలకు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది జాగ్రత్త. స్నేహితులు, బంధువుల నుంచి బహుమతులు అందుకోవచ్చు.  మీ పనితీరుని ఇతరుల పనితీరుతో పోల్చుకోవద్దు. సానుకూలంగా ఆలోచించండి. చాలా కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించండి. వైవాహిక జీవితంలో అందమైన మార్పును అనుభవించబోతున్నారు. 


తుల
మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటికి అనుకోని అతిథులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. మీ ప్రియమైనవారి నుంచి మీరు సంతోషపడే సమాచారం అందుకుంటారు. మీ ప్రతిష్టకు హాని కలిగించే వ్యక్తులను దూరం పెట్టండి. 


వృశ్చికం
వివాహితులు అత్తింటివారి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ అభిప్రాయాన్ని స్నేహితులు, బంధువులపై బలవంతంగా రుద్దకండి. మీ లక్ష్యాలను సాధించడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. IT నిపుణులు విదేశాల నుంచి కాల్ పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపాలని ఆలోచిస్తారు. 


Also Read:పెళ్లికానివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆదిదంపతులు వరమిస్తారట


ధనుస్సు
మీ బరువును  తగ్గించుకునేందుకు వ్యాయామం చేయకతప్పదు. వినోదం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మానేయండి. జీవితం, పని పట్ల మీ విధానంలో పరిపూర్ణతను కలిగి ఉండండి. సృజనాత్మక రంగాల వారికి విజయవంతమైన రోజు. గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్న వారికి ఎంజాయ్ చేయడానికి సమయం లభిస్తుంది. మీరు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.


మకరం
ఉద్యోగులు పనివిషయంలో వెనకడుగు వేయొద్దు. ఆభరణాల విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామితో కలహాలు మిమ్మల్ని మానసికంగా కలవరపరుస్తాయి. మీరు మార్చలేని వాటిని అంగీకరించడం మంచిది. మీ భాగస్వామితో ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టులు , ప్రణాళికలను అమలు చేయడానికి ఇది గొప్ప రోజు కావొచ్చు. కుటుంబం కోసం కొంత సమయం కేటాయించడం తప్పనిసరి. 


కుంభం
మీరు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని అదనపు లాభాలను సంపాదించే మార్గాల గురించి  మీ స్నేహితుడు ఇచ్చిన సలహాను పాటించండి. మీరు మీ పిల్లల కోసం ఏదైనా ప్లాన్ చేయవచ్చు.  మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.


మీనం
మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. పురాతన వస్తువులు, ఆభరణాల్లో పెట్టుబడి పెట్టడం వలన మీకు లాభాలొస్తాయి. కుటుంబ సభ్యులు,  బంధువులతో గడపడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. సహ ఉద్యోగులతో సంతోషంగా ఉంటారు.   పని ఒత్తిడి ప్రభావం మీ వైవాహిక జీవితంపై పడుతుంది.