2022 జనవరి 18 మంగళవారం రాశిఫలాలు

మేషంఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఎవరితోనైనా గొడవలు రావచ్చు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. ప్రజా జీవితానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం కాదు. మీరు విమర్శలకు గురవుతారు.

వృషభంఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. 

మిథునంఈ రోజు గందరగోళంగా ఉంటుంది.  కార్యాలయంలో ఎవరితోనైనా విభేదాలు తలెత్తవచ్చు. ఒత్తిడికి లోనవుతారు. అనవసరంగా మాట్లాడకండి. వైవాహిక సంబంధాల్లో పరస్పర విశ్వాసం తగ్గుతుంది. ఇతరులను నిందించవద్దు. మీ సామర్థ్యాన్ని చెడుకి కాకుండా మంచికి వినియోగించండి. 

Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..కర్కాటకంఈ రోజు గందరగోళంగా ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా విభేదాలు తలెత్తవచ్చు. చేపట్టిన పనులు పూర్తికావు. ఉద్యోగులుకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు మరింత కష్టపడాలి. విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేయొద్దు. 

సింహంఅందరి పట్ల గౌరవంతో ఉండండి.  కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కార్యాలయంలో ఏదైనా పనిలో విఫలమవుతారు. కుటుంబ సభ్యులకు మీపై నమ్మకం పెరుగుతుంది. అనవసరంగా ఖర్చుపెట్టే ధోరణి నియంత్రించుకోవాలి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రమాదకర పనులు జాగ్రత్తగా పూర్తిచేయండి. 

కన్యఉద్యోగంలో మీ హక్కులు పెరుగుతాయి. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాలు ఉండొచ్చు. కొన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు. మీరు మీ సమస్యలను స్నేహితులతో పంచుకోవచ్చు. ఈరోజు సాధారణ రోజు అవుతుంది.

Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..తులఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆస్తిలో వాటా పొందవచ్చు. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ వ్యాపారాల్లో  లాభాలు వస్తాయి.  కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.

వృశ్చికంఈరోజు చాలా సంతోషకరమైన రోజు అవుతుంది.  బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. మీ పనులు సజావుగా పూర్తవుతాయి.పెద్ద సమస్యకు పరిష్కారం లభించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధర్మ కర్మల పట్ల మొగ్గు చూపుతారు.

ధనుస్సు మీ బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులపై డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. కుటంబ సభ్యులపై ఆవేశాన్ని చూపొద్దు. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

Also Read: పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికతకూ గోవా ప్రత్యేకమే..మకరంఈ రోజు మీకు మంచి రోజు. ఈ రోజు ఒకరి మాట వల్ల బాధపడొచ్చు. అనవసర మాటలు కట్టిపెట్టండి. ప్రమాదకర పనులు చేసేటప్పుడు ఏంకాదులే అని నిర్లక్ష్యం చేయొద్దు. మీ  ఆరోగ్యం బాగానే ఉంటుంది. భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కుంభంఈరోజు స్నేహితునితో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. దుష్ట ప్రవృత్తి గల వ్యక్తులకు దూరం పాటించాలి. విలువైన వస్తువుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలి.ఒకరి మాటలు బాధిస్తాయి. దుర్భాషలాడవద్దు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. 

మీనంకొత్తగా పరిచయం అయిన వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు, రహస్యాలు చెప్పొద్దు.  మీ విజయాలను కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. తలపెట్టిన కొన్ని పనుల్లో నష్టాలు రావొచ్చు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. మీ బాధ్యతల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు.

Also Read:  ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...Also Read:  చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి