శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో మకరరాశి రాశి ఫలితాలు
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 5, వ్యయం : 2, రాజ్యపూజ్యం : 2, అవమానం : 4
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ధనం, సంపద, కుటుంబ కారకుడైన గురుడు తృతీయంలో, లగ్నాధిపతి అయిన శని జన్మంలో , రాహు కేతువులు 4,10 స్థానాల్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. కానీ మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ ఏడాది ఎలా ఉందంటే...
- ఈ ఏడాది ఆదాయం గతంలోకన్నా ఉత్తమంగా ఉంటుంది.స్థిరాస్తులు వృద్ధి చేస్తారు.
- ధనవ్యయం లేకుండా ఏపనీ పూర్తిచేయలేరు
- రావాల్సిన బాకీలు వసూలు కావడం అతి కష్టం
- ఇంట్లో మనశ్సాంతి ఉండదు,అకారణంగా మాటలు పడటం, అనారోగ్యం
- మొదటి ఆరునెలలు కన్నా... తర్వాతి ఆరు నెలల్లో కాస్త ఉపశమనం ఉంటుంది
- ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కానీ చాలా అడ్డంకులను అధిగమించాలి
- దొంగల భయం ఉండొచ్చు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి
- శని జన్మంలో ఉన్నందున తృతీయంలో ఉన్న గురుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వలేడు
- ప్రతివిషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, మనోధైర్యంతో వ్యవహరించాలి
- కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి, ఎవరికీ హామీలివ్వకండి
- ఎంతో ఓర్పు, సహనం ఉన్నప్పటికీ అపనిందలు తప్పవు
- మీ మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి
- ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి
- వ్యాపారంలో జాగ్రత్త వహించాలి
- తగిన ప్రణాళికతో ముందుకెళితే విద్యార్థులు సాధిస్తారువ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది
- పంట దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తాయి
- వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, నూతన వ్యాపారాలు కలసిరావు, హోల్ సేల్ వ్యాపారులు, స్టాక్ మార్కెట్ వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి
- ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది
మొత్తంమీద ఈ రాశివారికి ఈ ఏడాదంతా పరీక్షాకాలమే అన్నట్టుంటుంది. గ్రహబలం అస్సలు లేకపోవడంతో దైవబలం, మనోబలంతో ముందుకు సాగాలి....
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
Also Read: 2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.