2022 జూన్ 10 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
వృషభం
ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది. కుటుంబ పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అతిగా ఖర్చు పెట్టడం మానుకోవాలి. కొత్త ఉద్యోగంలో సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల ఆరోగ్యం, భద్రతను జాగ్రత్తగా చూసుకోండి. కొత్త పనులు లాభిస్తాయి.
మిథునం
ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ ఆహారాన్ని నియంత్రించండి. బాధ్యతను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. సోమరితనం వీడండి. మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ప్రయాణం చేయకపోవడమే మంచిది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
Also Read: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు
కర్కాటకం
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ప్రోత్సాహకరమైన సమాచారం పొందుతారు. ఆఫీసులో పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
సింహం
ఈ రోజు స్నేహితుడితో విభేదాలు రావొచ్చు. జీవిత భాగస్వామి సలహాతో మీరు ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారం కలసి రాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. తప్పుడు విషయానికి డబ్బులు ఖర్చు చేస్తారు. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్య రావొచ్చు.
కన్యా
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు శుభసమయం. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. దంపతుల మధ్య బంధం బావుంటుంది. విద్యార్థులు చదువుల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీ దినచర్యను నియంత్రించండి.
Also Read: మార్చి నెలలో పుట్టినవారు మోనార్క్ లు వీళ్లని ఎవ్వరూ మోసం చేయలేరు
తులా
లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో లాభపడతారు. ధన సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక విషయాలకు ఇది మంచి సమయం కాదు. మిత్రులతో విభేదాలు రావొచ్చు. కుటుంబ పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. నిగూఢమైన విషయాల అధ్యయనం పట్ల ఆసక్తి చూపుతారు.
వృశ్చికం
నిలిచిపోయిన పనులు ఈ రోజు పూర్తి చేయడంతో మీరు సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ పని తీరులో మార్పు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ధనానికి సంబంధించి కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. అధికారులతో చర్చించి ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు
మీ సమర్థతను మీరు తక్కువ అంచనా వేయొద్దు. ధనలాభం పొందుతారు. పూర్వ పరిచయస్తులను కలుస్తారు. ఈరోజు మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీ మాటల మీద సంయమనం పాటించండి. మంచి వ్యక్తులను కలుస్తారు.
మకరం
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. ఈ రోజు ఇంటి బాధ్యతతో పాటు ఆఫీసులో కూడా ఎక్కువ పని ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. బహిరంగ ప్రదేశాల్లో రహస్య చర్చలు జరపవద్దు. అవసరం లేని దగ్గర మీ అభిప్రాయాన్ని తెలియజేయవద్దు. మీకు హాని జరిగే అవకాశం ఉంది జాగ్రత్త.
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
కుంభం
ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాయం అయ్యే ప్రమాదం ఉంది. నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మళ్లీ పాత సమస్యలలో చిక్కుకోవచ్చు.
మీనం
ఈ రోజు ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. గతంలో వివాదాలు తొలగిపోతాయి. పెద్దల సలహాలు పాటించండి. పనుల్లో ఆర్థిక ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో విజయం సాధించవచ్చు. మీ సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయి.