అంటే సుందరానికి సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందని నేచురల్ స్టార్ నాని అన్నారు. అంటే సుందరానికి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రావడంతో ఈ సినిమా హిట్ అయిన ఫీలింగ్ వచ్చిందని తెలిపారు.
ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం. ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనే పదానికి సరైన అర్థం ఈ సినిమాతోనే వచ్చిందేమో. మరికాసేపట్లో అమెరికాలో షోలు పడబోతున్నాయి. ముందుగా ఇక్కడికి వచ్చిన దర్శకులు అందరికీ థ్యాంక్యూ. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అందరు హీరోలని కలిశాను. ఈ 14 సంవత్సరాల్లో దాదాపు అందరినీ కలిశాను. పవన్ కళ్యాణ్‌ను కలవడం ఇదే మొదటిసారి. కానీ నాకు ఆయన చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది.’
‘పవన్ కళ్యాణ్ చెప్పిన మాటతో నా కడుపు నిండిపోయింది. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లందరూ చాలా కష్టపడి చేశారు. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ తమ 100 పర్సెంట్ ఇచ్చేలా చేశారు. అది మీరు రేపు చూస్తారు. ఈ సినిమా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. పవన్ కళ్యాణ్ రావడంతో ఈ సినిమా హిట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నివేతా నా సినిమా ఫంక్షన్లకు చెప్పకుండా వచ్చేస్తుంది. వాళ్లు పెద్ద, వీళ్లు చిన్న అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేశారు. ఇలాంటి టీమ్ గెలవాలి. ఇలాంటి సినిమా గెలవాలి. రేపు గెలుస్తాననే నమ్మకం ఉంది.’
‘అంటే సుందరానికి ఎంటర్‌టైన్‌మెంట్ కాదు... ఎంజాయ్ మెంట్’ అంటూ నేచురల్ స్టార్ నాని తన స్పీచ్ ముగించారు.